Wednesday, October 9, 2024

అల్ప‌పీడ‌నం ఎఫెక్ట్‌.. ఇవ్వాల, రేపు తెలంగాణ వ్యాప్తంగా భారీవ‌ర్షాలు

బంగాళాఖాతంలో ఏర్ప‌డ్డ అల్పపీడనం ప్ర‌భాంతో తెలంగాణ వ్యాప్తంగా వర్షం కురుస్తోంది. ఇక..
హైద‌రాబాద్ సిటీ వ్యాప్తంగా ఉరుములు, మెరుపులతో కూడాని వర్షాలు కురుస్తున్నాయి. దీంతో మూసీ న‌దికి మ‌రోసారి వ‌ర‌ద పోటెత్తింది. రాష్ట్రంలో నిన్న (గురువారం) అత్య‌ధిక వ‌ర్ష‌పాతం వికారాబాద్ జిల్లా బొంరాస్‌పేట్‌లో 114.6 మి.మీ వ‌ర్ష‌పాతం న‌మోదైంది. ధరూర్‌లో 99.7మి.మీ, నాగ‌ర్‌క‌ర్నూల్ జిల్లా ఊర్కొండ‌(95.3), జోగుళాంబ గ‌ద్వాల గ‌ట్టు 93.3, భ‌ద్రాద్రి కొత్త‌గూడెం జిల్లా చంద్రుగొండ‌లో 90.9, హైదారాబాద్ తిరుమ‌ల‌గిరిలో 87.3, వికారాబాద్ జిల్లా కొడంగ‌ల్ 83.4, సంగారెడ్డి జిల్లా ముగ్దంప‌ల్లెలో 78.8, జిన్నారంలో 77.3, రంగారెడ్డి జిల్లా నందిగామ‌లో 78.5 మి.మీ వ‌ర్ష‌పాతం న‌మోదైంది.

ఇక‌.. ఇవ్వాల‌, రేపు, ఎల్లుండి తెలంగాణ వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశాలున్న‌ట్టు హైద‌రాబాద్ వాతావ‌ర‌ణ కేంద్రం తెలిపింది. ఇవ్వాల (శుక్ర‌వారం) నాగ‌ర్‌క‌ర్నూల్‌, వ‌న‌ప‌ర్తి జిల్లాల్లో అత్యంత భారీ వ‌ర్షాలుంటాయి. అదేవిధంగా రేపు (శ‌నివారం) నాగ‌ర్‌క‌ర్నూల్‌, న‌ల్గొండ‌, సూర్యాపేట‌, జిల్లాల్లో అత్యంత భారీ వ‌ర్షాలు, సంగారెడ్డి, వికారాబాద్‌, రంగారెడ్డి, మేడ్చ‌ల్‌, న‌ల్గొండ‌, సూర్యాపేట‌, ఖ‌మ్మం, భ‌ద్రాద్రి కొత్త‌గూడెం జిల్లాల్లో భారీ వ‌ర్షాల‌తో పాటు మోస్త‌రు వ‌ర్ష‌పాతం కురిసే అవ‌కాశం ఉంది.

కాగా, ఎల్లుండి 11వ తేదీన న‌ల్గొండ‌, సూర్యాపేట‌, మ‌హ‌బుబాబాద్‌, ఖ‌మ్మం, యాదాద్రి భువ‌నగిరి జిల్లాల‌కు అతి భారీ వ‌ర్ష సూచ‌న ఉంది. అత్యం భారీ వ‌ర్షాలు కురిసే జిల్లాల్లో మెద‌క్‌, సంగారెడ్డి, సిద్దిపేట‌, మేడ్చ‌ల్‌, యాదాద్రి, జ‌న‌గామ‌, మ‌హ‌బుబాద్‌, న‌ల్గొండ‌, సూర్యాపేట‌, ఖ‌మ్మం, భ‌ద్రాద్రి కొత్త‌గూడెం జిల్లాలున్నాయి. ఇక‌.. సాధార‌ణం నుంచి మోస్త‌రు వ‌ర్షాలు కురిసే ఈ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో ప‌డ‌వ‌చ్చ‌ని వాతావర‌ణ కేంద్రం చెబుతోంది.

కాగా, కుమ్రంభీం, మంచిర్యాల‌, నిర్మ‌ల్‌, నిజామాబాద్‌, సిద్దిపేట‌, మెద‌క్‌, సంగారెడ్డి, మేడ్చ‌ల్ మ‌ల్కాజిగిరి, రంగారెడ్డి, నారాయ‌ణ‌పేట‌, మ‌హ‌బూబ్‌న‌గ‌ర్‌, వ‌న‌ప‌ర్తి, జోగుళాంబ గ‌ద్వాల్‌, నాగ‌ర్‌క‌ర్నూల్‌, న‌ల్ల‌గొండ‌, యాదాద్రి భువ‌న‌గిరి, సూర్యాపేట‌, వ‌రంగ‌ల్‌, జ‌న‌గామ‌, భ‌ద్రాద్రి కొత్త‌గూడెం జిల్లాల్లో మోస్త‌రు వ‌ర్షం కురిసిన‌ట్టు హైద‌రాబాద్ వాతావ‌ర‌ణ కేంద్రం అధికారులు తెలిపారు. అదేవిధంగా జ‌య‌శంక‌ర్ భూపాల‌ప‌ల్లి, ములుగు, జ‌న‌గామ‌, క‌రీంన‌గ‌ర్‌, జ‌గిత్యాల‌, రాజ‌న్న సిరిసిల్ల జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలిక‌పాటి జ‌ల్లులు కురిసిన‌ట్టు స‌మాచారం.

Advertisement

తాజా వార్తలు

Advertisement