లారీ జీపును ఢీ కొంది. ఈ ఘటనలో తొమ్మిది మంది మృతి చెందారు. మరో 12మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ సంఘటన కర్ణాటక తుమూకూరు జిల్లాలోని బాలినహల్లిలో చోటు చేసుకుంది. క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. ప్రమాదంలో మృతి చెందిన వారిని రాయచూర్ జిల్లా వాసులుగా గుర్తించారు. అయితే 48వ నంబర్ జాతీయ రహదారిపై రాయచూర్ నుంచి బెంగళూరు వస్తున్న జీపును ఓవర్టేక్ క్రమంలో లారీ ఢీ కొట్టినట్లు సమాచారం. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. ప్రమాదంపై కేసు నమోదు చేశారు.
లారీ ..జీపు ఢీ-తొమ్మిది మంది మృతి-12మందికి తీవ్ర గాయాలు

Previous article
Next article
Advertisement
తాజా వార్తలు
Advertisement