Thursday, March 30, 2023

లారీ డ్రైవ‌ర్ పై కాల్పులు-హైద‌రాబాద్ శివార్ల‌లో సంఘ‌ట‌న‌

తుక్కుగూడ స‌మీపంలో ఔట‌ర్ రింగ్ రోడ్డు వ‌ద్ద గుర్తు తెలియ‌ని దుండ‌గుడు లారీ డ్రైవ‌ర్ పై కాల్పులు జ‌రిపాడు.ఈ సంఘ‌ట‌న హైద‌రాబాద్ శివార్లలో కాల్పుల కలకలం చోటుచేసుకుంది. జార్ఖండ్‌కు చెందిన మనోజ్ యాదవ్ అనే వ్యక్తి ఐరన్ లోడ్ లారీతో.. కేరళలోని కొచ్చి వైపు వెళ్తున్నాడు. అయితే లారీ హైదరాబాద్ సమీపంలోని తుక్కుగూడ ఎగ్జిట్ 14 వద్దకు చేరుకున్నప్పుడు.. కారులో వచ్చిన గుర్తు తెలియని వ్యక్తి తుపాకీతో లారీ డ్రైవర్ వైపు కాల్పులు జరిపాడు. దీంతో ఓఆర్ఆర్ వద్ద భయాందోళనలు నెలకొన్నాయి. ఈ కాల్పుల్లో లారీ డ్రైవర్‌‌కు ఎటువంటి గాయం కాలేదు. లారీ ముందు క్యాబిన్ అద్దాలు ధ్వంసం అయ్యాయి. ఈ ఘటనపై అటుగా వెళ్తున్న ఓ వ్యక్తి డయల్ 100 ద్వారా పోలీసులకు సమాచారం ఇచ్చాడు. దీంతో వెంటనే పహాడీ షరీఫ్ పోలీసులు వెంటనే ఘటన స్థలానికి చేరుకున్నారు. ఫోరెన్సిక్ నిపుణులను రంగంలోకి దించారు. కాల్పులు జరిపిన అనంతరం దుండగుడు కారులో శంషాబాద్ వైపు పారిపోయాడని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి.. నిందితుడి కోసం గాలింపు చేపట్టారు.

- Advertisement -
   

Advertisement

తాజా వార్తలు

Advertisement