Thursday, April 25, 2024

Lord Shiva: శివుడు షెడ్యుల్డ్​ కులం వాడే.. దేశంలో మహిళలకు ప్రాధాన్యం తగ్గుతోంది: వీసీ శాంతిశ్రీ

దేశంలోని 52 విశ్వవిద్యాలయాల్లో కేవలం ఆరు వర్సిటీల్లో మాత్రమే మహిళలకు అవకాశం ఉందని, అందులో ఒక వర్సిటీలో మాత్రమే షెడ్యుల్డ్​ కులాల వారికి చాన్స్​ దక్కిందన్నారు జవహర్​లాల్​ నెహ్రూ యూనివర్సిటీ వైస్​ చాన్స్​లర్​ శాంతిశ్రీ. అయితే రోజు రోజుకూ దేశంలో మహిళలకు ప్రాధాన్యం తగ్గుతుంది అనడానికి ఇదే నిదర్శనం అని ఆమె పేర్కొన్నారు. అంతేకాకుండా దళితులపై ఆగడాలు పెరుగుతున్నాయని, రాజస్థాన్​లో అగ్రవర్ణాల పిల్లలకు కేటాయించిన నీళ్లు తాకాడన్న కారణంగా ఓ దళిత బాలుడిని కొట్టి చంపారని ఆమె చెప్పారు. ఇక.. శివుడు శ్మశానంలో ఉంటాడు కాబట్టి షెడ్యుల్డ్​ కులాలకు చెందిన వాడే అయి ఉంటాడని, బ్రాహ్మణ కులం మాత్రం అస్సలు కాదన్నారు వీసీ శాంతిశ్రీ.

– డిజిటల్​ మీడియా, ఆంధ్రప్రభ

శివుడు శ్మశానంలో ఉంటాడు.. తక్కువ బట్టలు ధరిస్తాడు కాబట్టి అతను బ్రాహ్మణుల కులం కాదని, షెడ్యుల్డ్​ కులం వాడేనన్నారు జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ వైస్ చాన్స్​లర్ శాంతిశ్రీ ధూళిపూడి పండిట్. మనుధర్మ శాస్త్రం, శాస్త్రీయంగా ఏ దేవుడు బ్రాహ్మణుడు కాదని, అత్యున్నతమైనది క్షత్రియుడే అని ఆమె అన్నారు. నిన్న  (సోమవారం) సామాజిక న్యాయ మంత్రిత్వ శాఖ నిర్వహించిన బీఆర్ అంబేద్కర్ ఉపన్యాస కార్యక్రమంలో ఉపకులపతి ప్రసంగిస్తూ పలు ఆసక్తికరమైన అంశాలను వెల్లడించారు. “బ్రాహ్మణులు శ్మశాన వాటికలో కూర్చోవచ్చని నేను అనుకోను. శివుడు తన మెడలో పాములను ధరించి, శ్మశాన వాటికలో కూర్చుని, తక్కువ బట్టలు ధరిస్తాడు కాబట్టి అతను షెడ్యూల్డ్ కులం లేదా షెడ్యూల్డ్ తెగల సమాజానికి చెందినవాడు కావచ్చు. సమాజం బాగుపడాలంటే “కుల నిర్మూలన” అవసరం ఎంతైనా ఉంది అని ఆమె నొక్కి చెప్పారు.

మన దేవతల మూలాన్ని మనం మానవ శాస్త్రపరంగా లేదా శాస్త్రీయంగా అర్థం చేసుకోవాలని, మానవశాస్త్రపరంగా, లక్ష్మి, శక్తి, జగన్నాథుడు కూడా ఉన్నత కులానికి చెందినవారు కాదన్నారు వీసీ శాంతిశ్రీ. ఇక జగన్నాథుడు ఆదివాసీ (గిరిజన) వర్గానికి చెందినవాడు” అని ఆమె అన్నారు. “మనుస్మృతి ప్రకారం మహిళలు షెడ్యూల్డ్ కులాలకు చెందిన వారై ఉంటారని, అటువంటి పరిస్థితిలో ఒక స్త్రీ తాను బ్రాహ్మణ లేదా ఇతర వర్గానికి చెందినది అని చెప్పలేమన్నారు.

ఏ దేవుడూ బ్రాహ్మణుడు కాదని, అత్యున్నతమైనది క్షత్రియుడు మాత్రమేనని ఆమె చెప్పారు. పెళ్లయ్యే వరకు స్త్రీ తన తండ్రి కులాన్ని పొందుతుందని, పెళ్లయిన తర్వాత తన భర్త కులాన్ని పొందుతుందని, అది తిరోగమనశీలమని ఆమె అన్నారు. పుట్టిన సమాజం ప్రకారం కులాన్ని నిర్వచించలేదని చాలా మంది వ్యక్తులు ఉన్నారు, కానీ నేడు అది పుట్టుక ఆధారంగానే జరుగుతోంది” అని ఆమె పేర్కొన్నారు.

- Advertisement -

ఈ మధ్యకాలంలో  రాజస్థాన్‌లో అగ్రవర్ణాల విద్యార్థుల కోసం పెట్టిన తాగునీరు ముట్టుకున్నాడన్న ఆరోపణలతో దళిత బాలుడిని కొట్టి చంపారని, మానవ హక్కుల గురించి ప్రస్తావిస్తూ ఎవరూ అలాంటి ప్రవర్తనతో వ్యవహరించకూడదని ఆమె అన్నారు. కాగా, యూనిఫాం సివిల్ కోడ్ (యూసీసీ) అమలుకు తన మద్దతును తెలిపిన ఆమె, భీమ్ రావ్ అంబేద్కర్ స్వయంగా దానిని అమలు చేయాలని కోరుకున్నారని తెలిపారు.

మనకు సామాజిక ప్రజాస్వామ్యం లేకపోతే, మన రాజకీయ ప్రజాస్వామ్యం ఎండమావి” అని ఆమె అన్నారు. పురుష, స్త్రీ అనే వైషమ్యాలకు, లింగ న్యాయానికి అతిపెద్ద నివాళి UCC అమలు అవుతుందన్నారు. ఇప్పుడు కూడా దేశంలోని 52 విశ్వవిద్యాలయాలలో  కేవలం ఆరు వర్సిటీలలో మాత్రమే మహిళా వైస్​ చాన్స్​లర్లు ఉన్నారని, వాటిలో ఒకటి రిజర్వ్డ్ కేటగిరీకి చెందినది మాత్రమునని వీసీ శాంతిశ్రీ తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement