Saturday, April 20, 2024

ప్ర‌తియుగంలో శ్రీరాముడి జీవితం మాన‌వాళికి స్ఫూర్తి.. మోడీ.. ద్రౌప‌ది ముర్ము

శ్రీరాముడి జీవితం ప్ర‌తి యుగంలో మాన‌వాళికి స్ఫూర్తి అని ప్ర‌ధాని మోడీ అన్నారు. శ్రీరామ నవమి శుభ సందర్భంగా దేశ ప్రజలందరికీ శుభాకాంక్షలు. త్యాగం, కాఠిన్యం, సంయమనం, సంకల్పం ఆధారంగా మర్యాద పురుషోత్తమ భగవానుడు రామచంద్రుడి జీవితం ప్రతి యుగంలో మానవాళికి స్ఫూర్తిగా నిలుస్తుందని ప్ర‌ధాని మోడీ ట్వీట్ చేశారు.రామ నవమి సందర్భంగా దేశ ప్రజలందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. పురుషోత్తముడైన శ్రీరాముడి జీవితం నుంచి త్యాగం, సేవ యొక్క అమూల్యమైన సందేశాన్ని అందుకున్నాం. దేశ ప్రజలందరూ శ్రీరాముని మహోన్నతమైన ఆశయాలను అలవర్చుకుని ఉజ్వల భారతదేశ నిర్మాణానికి పూనుకోవాలని నా కోరిక అని రాష్ట్రపతి ట్వీట్ చేశారు. శ్రీరామ నవమి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement