Friday, April 19, 2024

Breaking: జర్నలిస్టుల సమస్యలపై సుదీర్ఘ చర్చ.. మథురలో ముగిసిన ఐజేయూ భేటీ

ఉత్త‌ర ప్ర‌దేశ్ రాష్ట్రంలోని మ‌థుర‌లో రెండ్రోజుల‌పాటు ఐజేయు జాతీయ కార్య‌వ‌ర్గ స‌మావేశాలు జ‌రిగాయి. ఈ స‌మావేశాల్లో ప‌లు కీల‌క అంశాల‌పై చ‌ర్చించారు. దేశంలోని మీడియా సంస్థలు, జర్నలిస్టుల స్థితిగతులు, భావ ప్రకటన స్వేచ్ఛను హరించే కుట్రలు, పాత్రికేయులపై దాడులు, హత్యలు తదితర అంశాలపై యూనియ‌న్ చ‌ర్చ జ‌రిపింది. ఈ సందర్భంగా ప్రవేశపెట్టిన పలు తీర్మానాలను సమావేశం ఏకగ్రీవంగా ఆమోదించింది. ఐజేయూ కార్యవర్గం, వివిధ రాష్ట్రాల జర్నలిస్టుల సంఘాల ప్రధాన బాధ్యులు, పాల్గొన్న ఈ సమావేశం మంగళవారం సాయంత్రం ముగిసింది.

మే 10 న జర్నలిస్టుల జాతీయ నిరసనదినం
జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం మే 10 న “జాతీయస్థాయి నిరసనదినం” పాటించాలని ఐజేయు జాతీయ కార్యవర్గ సమావేశం పిలుపు ఇచ్చింది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం మథురలోని గోవర్ధన్ ప్యాలస్ సమావేశమందిరంలో జ‌రిగిన స‌మావేశాల్లో ఈ నిర్ణ‌యం తీసుకున్నారు. దేశంలో వర్కింగ్ జర్నలిస్టులు ఎదుర్కుంటున్న వృత్తిపరమైన సమస్యలపై , ప్రభుత్వాల విధానాలపై సమావేశం లోతుగా చర్చించారు. జర్నలిస్టుల హక్కులను కాలరాయడంలో, ఎన్నోఏళ్ళుగా అమల్లో ఉన్న సదుపాయాలను రద్దు చేయడంలో కేంద్రప్రభుత్వం ముందంజ వేస్తుండగా , పలు రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా అదేబాటలో పయనిస్తున్నాయని సమావేశంలో వివిధ రాష్ట్రాల ప్రతినిధులు వెల్లడించారు. వర్కింగ్ జర్నలిస్టుల సమస్యల పరిష్కారాన్ని కోరుతూ ఒక జాతీయస్థాయి ఉద్యమాన్ని చేపట్టాలని కార్యవర్గసమావేశం నిర్ణయించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement