Monday, March 25, 2024

విశాఖ తీరాన ‘లండ‌న్ ఐ’ .. 125మీట‌ర్ల ఎత్తులో న‌గ‌ర అందాలు వీక్ష‌ణ .. ఎప్పుడంటే ..

జాయింట్ వీల్ ఎక్కిన వారికి తెలుస్తుంది ఎంత ఎత్తు ఉంటుంద‌నేది. క‌ళ్ళుకూడా తిరుగుతాయి మ‌రి.. అంతేనా గుండె కొట్టుకునే వేగం పెరుగుతుంది. అయినా స‌రే ఎక్క‌డం మానేస్తామా… అదొక మ‌జా.. ఆ కిక్కే వేర‌ప్ప .. అయితే అదే జాయింట్ వీల్ పై మొత్తం న‌గ‌రాన్నే చూసే ఏర్పాట్లు చేస్తే .. వావ్ అనుకుంటున్నారా .. ఇప్పుడా ఏర్పాట్లు జ‌రుగుతున్నాయి. ఎక్క‌డ అనుకుంటున్నారా ..అది కూడా అంద‌మైన స‌ముద్ర‌తీరాన‌.. విశాఖ‌ప‌ట్నంలో.. లండ‌న్ ఐ లాగే విశాఖ‌లో కూడా జాయింట్ వీల్ ఏర్పాటు చేస్తున్నారు. దాంతో ప‌ర్యాట‌కులు అత్యంత ఎత్తుకు వెళ్లి ఒక వైపు స‌ముద్రాన్ని ,,మ‌రొక‌వైపు భూమిని చూస్తూ ఎంజాయ్ చేయొచ్చు.

మ‌రి లండ‌న్ ఐ గురించి మీకు తెలుసా .. అంత‌ర్జాతీయ ప‌ర్యాట‌కుల‌ను ఆక‌ర్షించే విధంగా లండ‌న్ న‌గ‌రంలో లండ‌న్ ఐ ని ఏర్పాటు చేశారు.. థేమ్స్ న‌ది ఒడ్డున 130మీట‌ర్ల ఎత్తులో జాయింట్ వీల్ ను ఏర్పాటు చేసి ప‌ర్యాట‌కుల‌ను ఆక‌ర్షించారు. ఈ జాయింట్ వీల్ లో ఎక్కి ఎంచ‌క్కా లండ‌న్ న‌గ‌రం మొత్తాన్ని చూసేయ‌వ‌చ్చు. సేమ్ టు సేమ్ వైజాగ్ న‌గ‌రంలో కూడా ఇలాంటిదే ఏర్పాటు చేస్తున్నారు. వైజాగ్ సముద్రం ఒడ్డున 125 మీటర్ల ఎత్తుతో నుంచి నగర అందాలను వీక్షించేందుకు వీలుగా దీనిని ఏర్పాటు చేస్తున్నారు. ఇందుకోసం 15 ఎకరాల భూమి అవసరమని పర్యాటక అధికారులు గుర్తించారు. విశాఖ బీచ్ రోడ్డులో నాలుగు ప్రదేశాల్లో అధికారులు పరిశీలించారు. అయితే భీమిలి వైపు వెళ్లే బీచ్ రోడ్డులో ఫైనల్ చేసే అవకాశాలున్నాయని స‌మాచారం. రూ. 250 కోట్ల రూపాయల వ్యయంతో ఈ మెగావీల్ ను ఏర్పాటు చేస్తారు. ఇందులో మొత్తం 44 కేబిన్లు ఉంటాయి. ఒక్కో కేబిన్ లో 10 మంది కూర్చొవచ్చు. ఒకేసారి 440 మంది ఈ జాయింట్ వీల్ లో ప్రయాణించే వీలు వుంది. కేబిన్ లు మొత్తం గ్లాస్ తో ఏర్పాటు చేయడం వల్ల పర్యాటకులకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. అంతేకాకుండా కేబిన్ ఏసీ వైఫై ఆడియో ..వీడియో సదుపాయం కూడా ఉంటుంది. అంతేకాకుండా పబ్లిక్ అనౌన్స్ మెంట్ కూడా ఉంటుంది. ఈ వీల్ ఒక రౌండ్ తిరగడానికి 20 నిమిషాలు పడుతుంది.

ఈ కేబిన్ లో ఉన్న వారు 125 మీటర్ల ఎత్తుకు వెళ్లి రాత్రి డిన్నర్ కూడా చేసే అవకాశం ఉంటుంది. సముద్రం కొండగాలుల మధ్య విశాఖ నగరాన్ని 360 డిగ్రీల కోణంలో చూస్తూ ఎంజాయ్ చేసే అవ‌కాశాన్ని క‌లిపిస్తున్నారు.. మ‌రి జాగ్ర‌త్త‌ల మాటేంటి అనుకుంటున్నారా.. తుపాన్లతో పాటు 8.3 భూకంప తీవ్రతను తట్టుకునే విధంగా ఈ వీల్ నిర్మాణం ఏర్పాటు చేయాలని అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అంతేకాదు అత్యధిక ఉష్ణోగ్రతల నుంచి కూడా తట్టుకునేవిధంగా తయారు చేస్తారు. ఈ వీల్ లో గంటలకు 13,20 పర్యాటకులు వెళ్లే అవకాశం ఉంది. అందువల్ల వీరికి అన్ని విధాల సౌకర్యాలు ఏర్పాటు చేసే అవకాశం ఉంది.ఇక అస‌లైంది ప‌ర్యాట‌కంగా అభివృద్ధి చెందుతుందంటే అక్క‌డ వ్యాపారం కూడా సాగుతుంద‌నే ధోర‌ణిలో జాయింట్ వీల్ తో పాటు కింద షాపింగ్ కాంప్లెక్స్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. దీంతో దేశంలోనే కాకుండా అంతర్జాతీయ పర్యాటకులను ఆకర్షించే విధంగా ఇక్కడ అన్ని సదుపాయాలను ఏర్పాటు చేస్తారు. లండ‌న్ ఐ మాటేమో గాని విశాఖ‌లో లండ‌న్ ఐ ఎలా ఉండ‌నుందోన‌ని ప్ర‌తి ఒక్క‌రూ ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ జాయింట్ వీల్ స‌క్సెస్ అయితే .. విశాఖ పేరు మ‌రింత‌గా మోగ‌డం ఖాయ‌మే.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement