Saturday, April 20, 2024

ల‌క్నోలో 144సెక్ష‌న్ .. ఎప్ప‌టి వ‌ర‌కో తెలుసా ..

ఓ వైపు క‌రోనా, మ‌రో వైపు ఒమిక్రాన్ విజృంభిస్తున్నాయి. ప‌లు దేశాల‌కు ఇప్ప‌టికే ఒమిక్రాన్ వ్యాపించింది. దాంతో ప‌లు దేశాల్లో లాక్ డౌన్ ని విధించాయి. కాగా ఇండియాలో కూడా ఒమిక్రాన్ క‌ల‌క‌లం రేగింది. ఇక క‌రోనా కేసులు కూడా ఎక్కువ‌వుతున్నాయి. ఈ నేప‌థ్యంలో యోగి ఆదిత్యాన‌థ్ ప్ర‌భుత్వం రాష్ట్ర రాజ‌ధాని లక్నోలో 144సెక్షన్‌ను అమల్లోకి తీసుకుని వచ్చింది. సైబర్ క్రైమ్ సెల్ కూడా ఆన్‌లైన్ కార్యకలాపాలపై నిశితంగా గమనిస్తుంది. సోష‌ల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు పెట్టే వారిపై, పుకార్లు వ్యాప్తి చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోమ‌ని హెచ్చిరించారు.

ఇక 144సెక్ష‌న్ నిర్ణయం తక్షణం అమల్లోకి వచ్చింది. జనవరి 5, 2022 వరకు ఈ ఆదేశాలు అమలులో ఉండ‌నుంది. సినిమా హాళ్లు, మల్టీప్లెక్స్‌లు, రెస్టారెంట్లు, హోటళ్లు, జిమ్‌లు, స్టేడియంలను 50 శాతం సామర్థ్యంతో మాత్రమే తెరవాలని ఉత్తర్వులు జారీ చేసింది. మాస్క్ త‌ప్ప‌ని స‌రి చేసింది. ఏదైనా కార్యక్రమం ఉంటే.. వంద మంది కంటే ఎక్కువ పాల్గొనకూడదని నిర్ణ‌యించింది. క్రిస్మస్, డిసెంబర్ 31, న్యూ ఇయర్ వేడుక‌ల్లో కరోనా ప్రోటోకాల్ ఖచ్చితంగా పాటించాలని హెచ్చ‌రించింది. త‌ప్పని స‌రిగా.. సోష‌ల్ డిస్టెస్ పాటించాల‌ని ప్రభుత్వం తెలిపింది. జన సాంద్ర‌త ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా ఉంటుందని తెలిపారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement