Friday, March 29, 2024

బ్రిట‌న్ నూత‌న‌ ప్ర‌ధానిగా ఎన్నికైన లిజ్ ట్ర‌స్

బ్రిటన్ నూతన ప్రధానిగా లిజ్ ట్రస్ ఎన్నికయ్యారు. బిట్రన్ ప్రధాని పదవికి జరిగిన ఎన్నికల్లో భారత సంతతికి చెందిన బ్రిటన్ మాజీ ఆర్థిక మంత్రి రిషి సునాక్‌పై విదేశాంగ మంత్రి లిజ్ ట్రస్ గెలుపొందారు. దీంతో ఆమె ఆ దేశ కొత్త ప్ర‌ధానిగా బాధ్య‌త‌లు చేప‌ట్టనున్నారు. వెస్ట్‌మినిస్ట‌ర్‌లోని కాన్ఫ‌రెన్స్ సెంట‌ర్‌లో ఈరోజు స‌ర్ గ్ర‌హం బ్రాడీ ప్ర‌క‌ట‌న చేశారు. క‌న్జ‌ర్వేటివ్ రేసులో లిజ్ ట్ర‌స్‌కు 81,326 ఓట్లు పోల‌య్యాయి. ఇక మ‌న రిషి సునాక్‌కు 60,399 ఓట్లు ప‌డ్డాయి. మొత్తం ఎల‌క్ట‌రేట్ సంఖ్య 172,437. దీంట్లో 82.6 శాతం మంది ఓటింగ్‌లో పాల్గొన్నారు. 654 బ్యాలెట్ పేప‌ర్ల‌ను తిర‌స్క‌రించారు. బోరిస్ జాన్స‌న్ ప్ర‌ధాని బాధ్య‌త‌ల నుంచి త‌ప్పుకోవ‌డంతో.. క‌న్జ‌ర్వేటివ్ పార్టీలో పోటీ జ‌రిగింది. అయితే రిషి సునాక్‌, లిజ్ ట్ర‌స్ మ‌ధ్య చివ‌రి వ‌ర‌కు ఉత్కంఠ పోరు సాగింది. అనూహ్య రీతిలో రిషి సునాక్‌.. క‌న్జ‌ర్వేటివ్ నేత రేసులో ఓట‌మి పాల‌య్యారు. విజ‌యం సాధించిన లిజ్ ట్ర‌స్ ఇప్పుడు ఆ దేశ ప్ర‌ధాని కానున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement