Friday, April 26, 2024

తెలంగాణ‌లో రికార్డ్ సృష్టిస్తున్న మ‌ద్యం విక్ర‌యాలు

క‌రోనా క‌ల్లోలంతో ప‌ని లేకుండా మ‌ద్యం విక్ర‌యాలు జోరుగా సాగుతున్నాయి తెలంగాణ‌లో. ఈ ఏడాది డిసెంబ‌ర్ నెల‌లో నిన్న‌టి వ‌ర‌కు మ‌ద్యం అమ్మ‌కాలు 2,320కోట్ల‌ను దాట‌డం విశేషం. దాంతో డిసెంబ‌ర్ నెలలో మ‌ద్యం విక్ర‌యాలు స‌రికొత్త రికార్డును న‌మోదు చేస్తున్నాయి. ఈ ఏడాది ముగిసేందుకు ఇంకా ఏడు రోజుల స‌మ‌యం ఉంది. ఈ లోగా కొత్త సంవ‌త్స‌రం సంబ‌రాలు జ‌ర‌గ‌నున్నాయి. మ‌రి ఈ మ‌ధ్య‌లో మ‌ద్యం వినియోగం ఏ మేర‌కు కాసుల వ‌ర్షాన్ని కురిపిస్తుందో చూడాలి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇప్పటి వరకు ఒక నెలలో అత్యధికంగా విక్రయాలు రూ.2,800 కోట్లను దాటలేదు.

కానీ, ఈ ఏడాది డిసెంబర్ నెలలో 23వ తేదీ నాటికే మద్యం అమ్మకాలు 2,320 కోట్లను దాటేశాయి. కనుక డిసెంబర్ నెలకు మద్యం విక్రయాలు రూ.3,000 కోట్లను దాటిపోవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. అంటే నిత్యం సుమారు రూ.100 కోట్ల మద్యాన్ని తెలంగాణ ప్రజలు వినియోగిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ రూపేణా ప్రభుత్వానికి ఆదాయం దండిగా సమకూరనుంది. తెలంగాణ ఏర్పడిన మొదటి సంవత్సరంలో మద్యం విక్రయాల రూపంలో ప్రభుత్వానికి రూ.10,833 కోట్లు సమకూరింది. అది కాస్తా 2020-21 సంవత్సరంలో రూ.27,888 కోట్లకు పెరిగిపోవడం గమనార్హం.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement