Friday, June 25, 2021

అమ్మ బాబోయ్… సర్కస్‌లో ట్రైనర్‌పై సింహం దాడి

సర్కస్ అంటేనే ఎన్నో జంతువుల విన్యాసాల సమ్మేళనం. సింహాలు, పులులు, ఏనుగులు, కోతులూ ఇలా అన్ని జంతువులు ప్రేక్షకులను అలరిస్తాయి. అయితే, సర్కస్ లో సింహాలు చేసే విన్యాసాలను చూసి చిన్నా పెద్దా కేరింతలు కొడుతున్న క్రమంలో ఓ సింహాం రెచ్చిపోయింది. సింహాల ట్రైనర్‌ను తీవ్రంగా గాయపరిచింది. ఈ ఘటన రష్యాలో చోటు చేసుకుంది. శనివారం జరిగిన ఉరల్ ట్రావెలింగ్ సర్కస్ ప్రదర్శనలో ట్రైనర్ మాగ్జిమ్ ఓర్లోవ్‌ సింహాలతో విన్యాసాలు చేయిస్తుండగా ఓ సింహం దాడికి పాల్పడింది. దీంతో ట్రైనర్ తీవ్రంగా గాయపడ్డాడు. ఈ సంఘటన చూసి ప్రేక్షకులు ఒక్కసారిగా భయాందోళనకు గురైయ్యారు. ఈ సంఘటన సంబంధించిన భయంకరమైన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Advertisement

తాజా వార్తలు

Prabha News