Saturday, September 7, 2024

లైగ‌ర్ షూట్ కి బ్రేక్ – ఇంట్లోనే చిల్ అవుతోన్న విజ‌య్ దేవ‌ర‌కొండ‌

క‌రోనా వ్యాపిస్తోన్న నేప‌థ్యంలో లైగ‌ర్ షూటింగ్ కి బ్రేక్ ప‌డింది. మా తారాగ‌ణం, సిబ్బంది ఆరోగ్యానికి ప్ర‌మాదం ఉంది. అందుకే లైగ‌ర్ షూటింగ్ ని ర‌ద్దు చేస్తున్నామ‌ని న‌టి, నిర్మాత ఛార్మీ ట్వీట్ చేశారు. సుర‌క్షితంగా ఇంట్లోనే ఉండండి అని తెలిపారు. ఇంట్లోనే చిల్ అవ్వండ‌ని ట్వీట్ చేసింది. ఈ మేర‌కు హీరో విజయ్ దేవ‌ర‌కొండ త‌న పెంపుడు శున‌కంతో రిలాక్స్ మూడ్ లో ఉన్న ఫొటోని పోస్ట్ చేశారు. కాగా డైరెక్ట‌ర్ పూరీ జ‌గ‌న్నాథ్ తెర‌కెక్కిస్తోన్న చిత్రం లైగ‌ర్. ‘సాలా క్రాస్‌బ్రీడ్’ అనే క్యాప్షన్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో విజయ్ దేవ‌ర‌కొండ .. బాక్సర్ పాత్రలో కనిపించనున్నాడు. ఈ సినిమా కోసం విజయ్ ప్రత్యేకంగా మిక్స్‌డ్ మార్షల్ ఆర్ట్స్‌లో శిక్షణ తీసుకుంటున్నాడు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ఫస్ట్‌లుక్ పోస్టర్‌కి మంచి స్పందన వచ్చింది. ఇది విజయ్ కెరీర్‌లో తొలి పాన్ ఇండియా మూవీ. తెలుగుతోపాటు హింది, తమిళ, కన్నడ, మలయాళం భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement