Wednesday, April 24, 2024

Breaking: కరోనా బారిన పడిన కట్టప్ప.. పరిస్థితి విషమం!

సినీ పరిశ్రమకు కరోనా వెంటాడుతోంది. గత కొద్ది రోజులుగా సినీ నటులు కోవిడ్ బారిన పడుతున్నారు. టాలీవుడ్ లో హీరో మహేష్ బాబు, మ్యూజిక్ డైరెక్టర్ తమన్ కరోనా బారిన పడ్డారు.. తాజాగా బాహుబలిలో కట్టప్పగా నటించి అందరి అభిమానాన్ని చూరగొన్న సీనియర్ నటుడు సత్యరాజ్ కరోనా బారినపడ్డారు. ప్రస్తుతం చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆరోగ్య పరిస్థితి విషమించడం వల్లే ఆయన్ను ఆసుపత్రికి తరలించారని తెలుస్తోంది.

గతవారం సత్యరాజ్‌కు స్వల్ప లక్షణాలు బయటపడటంతో కరోనా టెస్టులు చేయించుకున్నారు. టెస్టుల్లో ఆయనకు పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. అప్పటి నుంచి హోమ్ ఐసోలేషన్‌లో ఉన్నారు. అయితే, ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం. సత్యరాజ్ త్వరగా కోలుకోవాలని సినీ ప్రేక్షకులు, ఆయన అభిమానులు ప్రార్థిస్తున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement