Tuesday, April 23, 2024

సమ్మె నోటీసిచ్చిన వారు విచారణకు రావాల్సిందే : హైకోర్టు

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో పీఆర్సీ పంచాయ‌తీ కోర్టులో జ‌రుగుతోంది. ప్ర‌భుత్వం విడుద‌ల చేసిన‌ పీఆర్సీ జీవోపై జేఏసీ నేత‌లు కోర్టులో పిటిష‌న్ వేసిన విష‌యం విదిత‌మే. అయితే ఇవాళ విచార‌ణ‌కు పిటిష‌న్ ను స్వీక‌రించింది. ఈ పిటీషన్లపై హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. స‌మ్మె నోటీసులు ఇచ్చిన 12 మంది ఉద్యోగ సంఘాల నేతలు విచారణకు హాజరు కావాలని హైకోర్టు ఆదేశించింది. ఈరోజు పీఆర్సీ కారణంగా తమ జీతాల్లో కోత పడుతుందని, విభజన చట్ట ప్రకారం రావాల్సిన బెనిఫిట్స్ రాలేదని పిటీషన్ వేశారు. దీనిపై విచారించిన హైకోర్టు జీతాలను తగ్గించే హక్కు ప్రభుత్వానికి ఉందన్నారు. అసలు హైకోర్టులో పిటీషన్ వేసి సమ్మె నోటీసు ఇవ్వడం ఏంటని ప్రశ్నించింది. సమ్మెతో ప్రభుత్వాన్ని బెదిరిస్తున్నారా ? అని వ్యాఖ్యానించింది. సమ్మె నోటీసులు ఇచ్చే పన్నెండు మంది సభ్యులు హైకోర్టు ఎదుట విచారణకు హాజరు కావాలని ఆదేశించింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement