Friday, April 19, 2024

Breaking: మళ్లీ క్షీణించిన లతా మంగేష్కర్ ఆరోగ్యం

ప్ర‌ముఖ గాయ‌ని ల‌తా మంగేష్క‌ర్ ఆరోగ్య ప‌రిస్థితి క్షీణించింది. ఆమె ఆరోగ్య ప‌రిస్థితి విష‌మంగా ఉంద‌ని ముంబై బ్రీచ్ క్యాండీ హాస్పిట‌ల్ డాక్ట‌ర్ ప్ర‌తిత్ సందాని తెలిపారు. ఐసీయూలో వెంటిలేట‌ర్‌పైనే ఉంచి ఆమెకు చికిత్స‌ను అందిస్తున్నార‌ని పేర్కొన్నారు. ప్ర‌స్తుతం ఆమె ఆరోగ్య ప‌రిస్థితిని వైద్యులు ప‌రిశీలిస్తున్నారని చెప్పారు.

కాగా, 92 ఏళ్ల లతా మంగేష్కర్.. కరోనా బారిన పడి జనవరి 8న బ్రీచ్ కాండీ హాస్పిటల్‌లో చేరారు. అప్పటి నుంచి ఆమెకు డాక్టర్ ప్రతిత్ సమదానీ బృందం చికిత్స అందిస్తున్నారు. ఇటీవల ఆమె ఆరోగ్యంలో మెరుగు పడడంతో వెంటిలేటర్ సపోర్ట్ తొలగించారు. అయితే ఈ రోజు మళ్లీ వెంటిలేటర్ సపోర్ట్‌పై ఉంచామని వైద్యులు తెలిపారు. మరోవైపు మహారాష్ట్ర ఆరోగ్య మంత్రి రాజేష్ తోపే డాక్టర్ ప్రతీత్‌తో మాట్లాడి లతా ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement