Friday, April 19, 2024

హ‌ర్యానాలో ఘోర ప్ర‌మాదం : 20మంది కార్మికుల గ‌ల్లంతు

హర్యానా రాష్ట్రంలోని బివాని ప్రాంతంలో పెను ప్రమాదం జరిగింది. దాడమ్‌ మైనింగ్‌లో జోన్‌లో కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ దుర్ఘటనలో చాలా మంది కూలీలు ప్రమాదంలో చిక్కుకుపోయినట్టు తెలుస్తోంది. వాహనాలు శిథిలాల్లో ఉన్నాయ‌ని, అలాగే 20మంది కార్మికులు గ‌ల్లంతైన‌ట్లు ప్రాథమికంగా అధికారులు అంచనా వేస్తున్నారు. వారిని బయటకు తీసుకొచ్చేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ప్రమాద స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు ముమ్మరం చేశారు. తీవ్రంగా గాయపడిన ఇద్దర్ని ఆసుపత్రికి తరలించారు. గల్లంతైన వారి కోసం గాలిస్తున్నారు. హర్యానా వ్యవసాయ శాఖ మంత్రి జేపీ దలాల్‌ ఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. సహాయక చర్యలు పర్యవేక్షిస్తున్నారు. ఒకరిద్దరు చనిపోయినట్టు ప్రచారం జరుగుతోందన్న ఆయన.. ప్రస్తుతానికి అధికారికంగా చెప్పలేమంటున్నారు. ప్రమాదంపై హర్యాన సీఎం మనోహర్‌ లాల్‌ ఖట్టర్‌ తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తంచేశారు.

హర్యానాలోని భివానీ జిల్లాలోని మైనింగ్ జోన్‌లో శనివారం కొండచరియలు విరిగిపడటంతో కనీసం ఇద్దరు వ్యక్తులు మరణించారు మరియు అనేక మంది చిక్కుకున్నారని భయపడ్డారు. తోషమ్ బ్లాక్‌లోని దాడం మైనింగ్ జోన్‌లో జిల్లా యంత్రాంగం రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించింది.ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ త్వరితగతిన రెస్క్యూ ఆపరేషన్లు, క్షతగాత్రులకు తక్షణ సహాయం అందించడానికి స్థానిక పరిపాలనతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నట్లు ట్వీట్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement