Wednesday, April 24, 2024

మూడు దేశాల్లో ‘ఎఫ్ ఐఆర్’ చిత్రం బ్యాన్

ఎఫ్ ఐఆర్ చిత్రానికి మూడు దేశాలు షాక్ ఇచ్చాయి. కువైట్, మ‌లేషియా, ఖ‌తార్ లో ఈ చిత్రాన్ని బ్యాన్ చేశారు. ఈ విష‌యాన్ని హీరో విష్ణు విశాల్ స్వ‌యంగా తెలిపారు. ఈ చిత్రంలోని సినిమాలోని ప్రధాన కంటెంట్ కారణంగా… సెన్సార్ ను ఈ సినిమా క్లియర్ చేయలేకపోయినట్టు సమాచారం.ఈ చిత్రంలో మంజిమా మోహన్, రైజా విల్సన్, గౌతమ్ వాసుదేవ్ మీనన్, గౌరవ్ నారాయణన్, రెబా మోనికా జాన్ తదితరులు ప్రధాన పాత్రలను పోషించారు. ఈ సినిమాలో విష్ణు విశాల్ మోస్ట్ వాంటెడ్ ముస్లిం యువకుడిగా నటించగా.. గౌతమ్ మీన్ పోలీసు అధికారిగా నటించారు. ‘ఎఫ్ఐఆర్’. ఈ సినిమా ట్రైలర్ విడుదలైనప్పటి నుంచి సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఈరోజు ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement