Friday, March 29, 2024

ఆర‌డుగుల బుల్లెట్ లా కేటీఆర్ త‌న‌యుడు హిమాన్షు : వైర‌ల్ గా ఫొటో

సాధార‌ణంగా రాజ‌కీయ నాయ‌కుల‌పై విమ‌ర్శ‌లు, ఆరోప‌ణ‌లు రావ‌డం స‌హ‌జ‌మే. అయితే ఒక్కోసారి ఫ్యామిలీ మెంబ‌ర్స్ పై కూడా విమ‌ర్శ‌నాస్త్రాలు సంధిస్తుంటారు ప్ర‌తిప‌క్షాల నేత‌లు. కాగా మంత్రి కేటీఆర్ కుమారుడు హిమాన్షుని కూడా అదే విధంగా ట్రోల్ కి గురి చేశారు. బొద్దుగా ఉండే హిమాన్షుపై ప‌లు ర‌కాల కామెంట్స్ కూడా వ‌చ్చాయి. వాటికి కేటీఆర్ ఆవేద‌న కూడా వ్య‌క్తం చేశారు. కాగా నాటి హిమాన్షు నేడు ఎలా ఉన్నాడో చూస్తే వావ్ అనాల్సిందే. ఆర‌డుగుల ఎత్తు ఎదిగాడు హిమాన్షు. గతానికి భిన్నంగా వెయిట్ బాగా తగ్గినట్లుగా కనిపిస్తోంది. కాగా ప్ర‌స్తుతం సీఎం కేసీఆర్ త‌మిళ‌నాడు టూర్ లో ఉన్నారు. ఈ మేర‌కు సీఎం స్టాలిన్ నివాసానికి వెళ్లారు. కుటుంబ‌స‌మేతంగా వెళ్ళిన కేసీఆర్ స్టాలిన్ తో గ్రూప్ ఫొటోలు దిగారు. ఈ ఫొటో వైర‌ల్ గా మారింది. ఈ ఫొటోలో హైలెట్ గా మారాడు హిమాన్షు.

గడిచిన కొద్దికాలంగా మీడియాకు కనిపించని హిమాన్షు.. తాజాగా తమిళనాడు టూర్ లో గ్రూపు ఫోటోకు ఫోజు ఇచ్చిన వేళ.. అక్కడున్న వారందరి కంటే హైట్ గా ఉండటమే కాదు.. అరడుగుల బుల్లెట్ అన్న మాటకు సరిగ్గా సూట్ అయ్యేలా ఉన్నాడు. ఏమైనా.. తాజా మేకోవర్.. హిమాన్షుపై అనవసరంగా నోరు పారేసుకునే వారికి ఆయన దిమ్మ తిరిగేలా షాకిచ్చారని చెప్పక తప్పదు. ఏమైనా.. హిమాన్షు మేకోవర్.. అందరూ మాట్లాడుకునేలా మారింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement