Sunday, April 14, 2024

కృష్ణ మరణం చిత్రపరిశ్రమకు తీరని లోటు.. పవన్

సూపర్‌ స్టార్‌ కృష్ణ మరణం పట్ల సినీనటుడు, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ విచారం వ్యక్తం చేశారు. ఆయన మృతి తెలుగు చిత్ర పరిశ్రమకు తీరనిలోటని అన్నారు. ఈ మేరకు ఆయన ప్రకటన విడుదల చేశారు. చిత్రసీమలో సూపర్‌ స్టార్‌ బిరుదుకి సార్థకత చేకూర్చిన కృష్ణ తుది శ్వాస విడిచారనే విషయం ఎంతో ఆవేదన కలిగించిందన్నారు. ఆయన కోలుకుంటారని ఆశించాను. ఇప్పుడు ఈ విషాద వార్త వినాల్సి వచ్చిందన్నారు.

ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. స్నేహశీలి, మృదు స్వభావి అయిన ఆయన ప్రతి ఒక్కరితో ఎంతో ఆప్యాయంగా ఉండేవారు.. మద్రాస్‌లో ఉన్నప్పటి నుంచి తమ కుటుంబంతో చక్కటి అనుబంధం ఉందన్నారు. సినిమా రంగం క్షేమాన్ని కాంక్షించే ఆయన మరణం తెలుగు చలనచిత్ర సీమకు తీరనిలోటని, ఆయన కుమారుడు మహేష్‌ బాబుకి, ఇతర కుటుంబ సభ్యులకు తన తరఫున, జనసేన పక్షాన ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నానన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement