Friday, March 29, 2024

తెలంగాణ‌కు ఎదురుదెబ్బ – కృష్ణాజలాల పున:పంపిణీ సాధ్యం కాద‌న్న టైబ్యున‌ల్

అమరావతి, ఆంధ్రప్రభ : తెలంగాణ కోరుతు న్నట్టు- కృష్ణా జలాల పున:పంపిణీ సాధ్యం కాదని కృష్ణా జల వివా దాల -టైబ్యునల్‌-2 (బ్రజేష్‌ కుమార్‌ -టైబ్యునల్‌) స్పష్టం చేసిం ది. దీంతో బచావత్‌ -టైబ్యునల్‌ (కృష్ణా జల వివాదాల -టైబ్యునల్‌-2) ఉమ్మడి రాష్ట్రాన్రికి కేటాయించిన కృష్ణా జలాల పున:పంపిణీ పై ఎంతో కాలంగా కొనసాగుతున్న వివాదానికి తెరపడినట్టయింది. బచావత్‌ -టైబ్యునల్‌ ఉమ్మడి రాష్ట్రాన్రికి కేటాయించిన 811 టీ-ఎంసీల పైనా..రాష్ట్ర పునర్విభజన సందర్భంగా 811 టీ-ఎంసీల్లో రెండు తెలుగు రాష్ట్రాల్ర కేటాయిం పులపైనా పున:సమీక్ష చేసే అవకాశమే లేదనీ, కృష్ణాలో 65 శాతం నీటి లభ్యతపై ఒనగరూరే అదనపు జలాల పంపిణీపైనే దృష్టి పెడతామని తేల్చి చెప్పింది. ఏపీ ఎప్పటి నుంచో ఇదే వాదన వినిపిస్తున్నా తెలంగాణ మాత్రం ససే మిరా అంటోంది. కృష్ణా జలాలను 50:50 శాతం ప్రాతి పదికన పున:పంపిణీ చేయాలని పట్టు-బడుతోంది. ఈ వాదన సాంకేతికంగా, న్యాయపరంగా, చట్టబద్దంగా సాధ్యం కాదని ఏపీ చేస్తున్న వాదనలకు ఇపుడు బ్రజేష్‌ కుమార్‌ -టైబ్యునల్‌ నిర్ణయం బలం చేకూర్చినట్టయింది. అపెక్స్‌ కౌన్సిల్‌ అనుమతులు లేకుండా కేవలం తాగునీటి ప్రాజెక్టుగా చూపెడుతూ పాల మూరు-రంగారెడ్డి పేరుతో భారీ సాగునీటి ప్రాజెక్టు నిర్మా ణం చేస్తుండటమే కాకుండా కృష్ణా నుంచి 90 టీ-ఎంసీలను కేటాయిస్తూ తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన జీవోను సవాల్‌ చేస్తూ ఏపీ జల వనరుల శాఖ ఇంటర్‌ లొకేటరీ అప్లికేషన్‌ (ఐఏ) రూపంలో -టైబ్యునల్‌ కు ఫిర్యాదు చేసింది. దీనిపై తాజాగా విచారణ చేపట్టిన బ్రజేష్‌ కుమార్‌ -టైబ్యునల్‌ కృష్ణా జలాల పున:పంపిిణీపై కీలక వ్యాఖ్యలు చేసింది.

2014 రాష్ట్ర విభజన చట్టంలోని సెక్షన్‌-89 ప్రకారం కృష్ణా జలాల కేటాయింపులో తమ పరిధి పరిమితం.. అంతరాష్ట్ర నదీ జల వివాదాల చట్టం (ఐఎస్‌ఆర్‌ డబ్ల్యూఏ)- 1956 సెక్షన్‌-3, 5ల ప్రకారం పునర్విభజన అనంతరం రెండు రాష్ట్రాల్రకు నీటి కేటాయిం పులు పూర్త య్యాయని వెల్లడించింది. కృష్ణాలో అదనపు జలాల లభ్యత ఉంటే నీటి కేటాయింపులు చేసే బాధ్యత చేపడతామనీ, బచావత్‌ -టైబ్యునల్‌ కేటాయింపులపై పున:సమీక్షకు అవకాశం ఉండదని తెలిపింది. దీంతో రెండు రాష్ట్రాల్రకు పంపిణీ చేసిన 811 టీ-ఎంసీలు పోను 65 శాతం నీటి లభ్యత ఆధారంగా గుర్తించిన మరో 194 టీ-ఎంసీల పంపిణీపైనే దృష్టి పెడతా మని బ్రజేష్‌ కుమార్‌ -టైబ్యునల్‌ వెల్లడించినట్టయింది.

ఇవీ కేటాయింపులు
రాష్ట్ర పునర్విభజన సందర్భంగా బచావత్‌ -టైబ్యునల్‌ కేటాయింపులకు అనుగుణంగా కేంద్ర జలశక్తి సమక్షంలో 2015 జూన్‌ 19న రెండు రాష్ట్రాల్ర మధ్య కుదిరిన రాతపూర్వక ఒప్పందాలను అనుసరించి 66:34 నిష్పత్తి లో కృష్ణా జలాల పంపిణీ ప్రక్రియ పూర్తయింది. ఈ మేరకు ఏపీకి 512, తెలంగాణకు 299 టీ-ఎంసీలు కేటాయించారు. -టైబ్యునల్‌ తీర్పులు సుప్రీంకోర్టు డిక్రీతో సమానం.. అంతర్‌ రాష్ట్ర నదీ వివాదాల చట్టం (ఐఎస్‌ఆర్‌డబ్ల్యూడీ) 1956 చట్టంలోని సెక్షన్‌6(2) ప్రకారం కొత్త -టైబ్యునళ్ళు పాత -టైబ్యునల్‌ ఆదేశాలను పున: సమీక్షించటం చట్టరీత్యా సాధ్యం కాదు.. అందువల్లనే బ్రజేష్‌ కుమార్‌ -టైబ్యునల్‌ కృష్ణాలో 65 శాతం నీటి లభ్యత ఆధారంగా అదనంగా అందుబాటు-లోకి వచ్చే 163 టీ-ఎంసీలు, వరదల సమయంలో ఒనగూరే 285 టీ-ఎసీంసీల మిగులు జలాలు.. మొత్తం 448 టీ-ఎంసీలను ఏపీ, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్రలకు పంచే విషయానికే పరిమితమైంది. వీటిలో 194 టీ-ఎంసీలను రెండు తెలుగు రాష్ట్రాల్రకు పంపిణీ చేయా ల్సి ఉంది. విభజన చట్టంలోని 11వ షెడ్యూల్‌ లో ఏపీలో అదనంగా నాలుగు ప్రాజెక్టులకూ, తెలంగాణలోని రెండు ప్రాజెక్టులకు కృష్ణా జలాలను కేటాయించారు. ఏపీలో తెలు గుగంగ విస్తరణకు 29, గాలేరు-నగరి ప్రాజెక్టుకు 38, హంద్రీనీవాకు 40, వెలిగొండ కు 43.50 టీ-ఎంసీలు..మొత్తం 150.50 టీ-ఎంసీలు కేటా యించారు. తెలంగాణలోని కల్వకుర్తికి 25, నె-్టట-ంపాడుకు 22 టీ-ఎంసీలు..మొత్తం 47 టీ-ఎంసీలు కేటాయించారు.
కృష్ణా జలాల పంపిణీపై రెండు రాష్ట్రాల్రకు అభ్యంత రాలున్నా అవన్నీ బచావత్‌ -టైబ్యునల్‌ కేటాయింపులు తరువాత అదనంగా కేటాయించిన జలాలపై తప్ప అంతకుముందు నిర్దారణ అయిన వాటాలపై కాదని ఏపీ చెబు తోంది. కృష్ణా జలాల పున:పంపిణీ కోసం కొత్త -టైబ్యునల్‌ ఏర్పాటు- చేయాలని ఎప్పటి నుంచో డిమాండ్‌ చేస్తున్న తెలంగాణ ప్రభుత్వం బ్రజేష్‌ కుమార్‌ -టైబ్యునల్‌ వ్యాఖ్యల అనంతరం ఎలాంటి వైఖరి అనుసరిస్తుందో వేచి చూడాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement