Thursday, April 25, 2024

పనబాక ఫిజిక్‌పై కొడాలి షాకింగ్ కామెంట్స్

తిరుపతి ఉప ఎన్నిక రాజకీయంగా వేడి పెంచుతోంది. వైసీపీ, టీడీపీ నేతల మద్య మాటల తూటాలు పెలుతున్నాయి. ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. ఎప్పుడు తన హాట్ కామెంట్స్‌ తో నిత్యం వార్తల్లో ఉండే మంత్రి కొడాలి నాని.. తిరుపతి ఉప ఎన్నికలో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సీనియర్ మహిళా నేత పనబాక లక్ష్మిపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. తన అభ్యర్ధి గురుమూర్తికి రాజకీయానుభవం లేదని చంద్రబాబు చెప్పడం సరికాదని మంత్రి కొడాలి పేర్కొన్నారు. రాజకీయాల్లో సేవాభావం ఉన్న కొత్త తరం రావాలని ఆయన అన్నారు. తద్వారా సేవాభావం కలిగిన గురుమూర్తి తిరుపతి బరిలోకి దిగడం సరైన నిర్ణయమేనని కొడాలి అన్నారు.

”సమస్య అంటే చటుక్కున లేచి పరిగెత్తే బాడీ ఫిజిక్ ఉండాలని, కానీ బౌన్స్‌ వచ్చిన వాళ్లని రాజకీయాల్లో పెట్టుకుని ఏం చేస్తా’’ అంటూ పనబాకపై పరోక్షంగా మంత్రి కొడాలి నాని వ్యాఖ్యానించారు. దీంతో పనబాక లక్ష్మి శరీరాకృతిపై మంత్రిగా బాధ్యతాయుత స్దానంలో ఉన్న కొడాలి నాని చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement