Friday, April 26, 2024

ప్ర‌పంచంలోనే సుధీర్ఘ ముద్దుతో రికార్డ్ సృష్టించిన ‘థాయ్ లాండ్’ జంట‌

ప్ర‌పంచంలోనే అత్యంత సుధీర్ఘ ముద్దుతో రికార్డు సృష్టించారు థాయ్ లాండ్ కు చెందిన ఓ జంట‌. కిస్ డే ఆఫ్ వాలెంటైన్స్ వీక్ సంద‌ర్భంగా ఈ రికార్డు న‌మోదయింది. థాయ్‌లాండ్‌లోని మ్యూజియం రెపల్స్ బిలీవ్ ఇట్ అండ్ నాట్ కీ ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. వాలెంటైన్స్ వీక్ సందర్భంగా నిర్వహించిన ఈ పోటీలో 9 జంటలు పాల్గొన్నాయి. 70 ఏళ్ల వృద్ధ దంపతులు కూడా పోటీపడటం విశేషం.. థాయ్‌లాండ్‌లోని పటాయాలో జరిగిన ఈ పోటీల్లో ఎక్కచాయ్ తిరనారత్, లక్ష్యా తిరనారత్ దంపతులు ఈ రికార్డు సృష్టించారు. పోటీలో గెలుపొందిన తర్వాత ఈ జంటకు గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ నుంచి సర్టిఫికేట్ అందించారు. అంతేకాకుండా నిర్వాహకులు ఇద్దరికీ నగదు బహుమతి, డైమండ్ రింగ్ అందజేశారు.

ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ కాంటెస్ట్‌లో గెలిచిన జంట అంతకు ముందే ముద్దులో రికార్డ్‌ క్రియేట్‌ చేశారు. 2011లో ఎక్కువ సమయం ముద్దులు పెట్టుకుని రికార్డు సృష్టించారు. ఇది 46 గంటల 24 నిమిషాల 9 సెకన్ల పాటు కొనసాగింది. ఇక ఈ జంట ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశమయ్యారు. 2011, 2013లో రెండు రికార్డులు సృష్టించిన తర్వాత ఈ జంట థాయ్‌లాండ్‌లో చాలా ఫేమస్‌ అయ్యారు. సెలబ్రిటీల మాదిరిగానే వారి ఫోటో, వీడియోలు వైరల్ అయ్యాయి. ఇప్పటి వరకు ఆ జంట రికార్డ్‌ని ఎవ్వరూ బ్రేక్ చేయలేకపోయారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement