Friday, March 29, 2024

మ‌రోసారి నానితో కీర్తిసురేశ్ – ‘ద‌స‌రా’ చిత్రం పూజాకార్య‌క్ర‌మాలు

నేచుర‌ల్ స్టార్ హీరో నాని నటిస్తోన్న తాజా చిత్రం నేను లోక‌ల్. ఈ చిత్రంలో హీరోయిన్ గా కీర్తి సురేశ్ నటిస్తోంది. డెబ్యూ దర్శకుడు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో పీరియాడిక్ డ్రామాగా ఈ చిత్రం తెరకెక్కబోతోంది. ఈ చిత్రంలో నాని తెలంగాణ యాసలో డైలాగులు చెప్పబోతున్నాడు. ఆ మధ్యన విడుదలైన మోషన్ పోస్టర్ లో నాని లుక్ రఫ్ గా ఉండబోతున్నట్లు అర్థం అయింది. ఈ చిత్రంలో నాని పాత్రలో నెగిటివ్ షేడ్స్ ఉండబోతున్నాయి. కాగా ఈ మూవీ చిత్రీకరణ పనులు ప్రారంభించనున్నారు. తాజాగా ఈ రోజు ‘దసరా’ మూవీ టీం హైదరాబాద్‌లో విజయవంతంగా పూజా కార్యక్రమాన్ని ముగించుకుంది. ఈ కార్యక్రమానికి నాని, కీర్తి సురేష్ హాజరయ్యారు. ఈ సందర్భంగా పలు ఫొటోలను చిత్రం యూనిట్ సోషల్ మీడియా వేదికన అభిమానులతో పంచుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement