Saturday, May 21, 2022

Breaking: కిడ్నాప్ అయిన బాలుడు సేఫ్.. ఎక్కడ ఉన్నాడంటే..

హైదరాబాద్ లోని ఎంజీబీఎస్‌లో కిడ్నాప్ అయిన బాలుడు సుర‌క్షితంగా త‌ల్లిదండ్రుల చెంత‌కు చేరాడు. సోమ‌వారం రాత్రి ఎంజీబీఎస్ బ‌స్టాండ్‌లో న‌వీన్ అనే బాలుడు కిడ్నాప్‌కు గుర‌య్యాడు. మిర్యాలగూడలో బాలుడి ఆచూకిని పోలీసులు కనుగొన్నారు. అనంతరం బాలుడిని క్షేమంగా తల్లిదండ్రుల వద్దకు చేర్చారు. కిడ్నాప్ చేసిన వ్య‌క్తే బాలుడిని బ‌స్సు ఎక్కించిన‌ట్లు పోలీసులు అనుమానం వ్య‌క్తం చేస్తున్నారు. బాలుడు మిస్సింగ్ కేసును కిడ్నాప్‌గానే దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. ఎంజీబీఎస్‌లోని సీసీటీవీ ఫుటేజీల‌ను పోలీసులు ప‌రిశీలిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement