Thursday, April 18, 2024

Sports: ఖేలో చెస్​.. క్రీడాకారులకు ప్రోత్సాహం, దేశంలో విప్లవాత్మకమైన మార్పునకు నాంది!

ఖేలో ఇండియా ప్రోగ్రాం తరహాలోనే ఖేలో చెస్ కార్యక్రమం కూడా దేశ క్రీడల్లో విప్లవాత్మక మార్పులు తీసుకురాగలదని అఖిల భారత చెస్ సమాఖ్య (ఏఐసీఎఫ్) కార్యదర్శి భరత్ సింగ్ చౌహాన్ అన్నారు. జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలో తొలిసారిగా చెస్ ఒలింపియాడ్ టార్చ్ రిలే సందర్భంగా ఖేలో చెస్ కార్యక్రమాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన తర్వాత ఏఐసీఎఫ్ ఉన్నతాధికారి ఈ విషయాన్ని వెల్లడించారు.

దేశంలోని యువతలో చాలా ఆడేవాళ్లు చాలామంది ఉన్నారు. AICF యువ ప్రతిభను అభివృద్ధి చేయడంపై సీరియస్​గా దృష్టిపెడుతోంది. అయితే.. చెస్ కోసం ఖేలో ఇండియా వంటి కార్యక్రమం దేశంలోని క్రీడలో విప్లవాత్మక మార్పులు తీసుకురాగలదు. “ఇది దేశాన్ని చెస్ పవర్‌హౌస్‌గా మార్చే మా మిషన్‌ను బలపరుస్తుంది. ఆ స్థాయి దేశవ్యాప్త ఈవెంట్ యువ భారతీయులను క్రీడలో పాల్గొనేలా ప్రేరేపించడం, ప్రోత్సహించడమే కాకుండా దేశవ్యాప్తంగా ఉన్న అత్యుత్తమ ప్రతిభను వెలికితీస్తుంది” అని చౌహాన్  తెలిపారు.

విశ్వనాథన్ ఆనంద్, కోనేరు హంపీ వంటి అనుభవజ్ఞులతో పాటు ఆర్ ప్రజ్ఞానానంద.. గుకేష్ డి వంటి యువ ప్రతిభావంతులు ప్రపంచ వేదికపై నిలకడగా ప్రదర్శన ఇవ్వడంతో భారతదేశం ఇటీవలి సంవత్సరాల్లో ప్రపంచంలోని టాప్ చెస్ ఆడే దేశాల్లో ఒకటిగా నిలిచింది. 2014 నుండి ప్రపంచంలోనే అతిపెద్ద చెస్ ఈవెంట్ — ఒలింపియాడ్ –లో దేశం 3 పతకాలను గెలుచుకుంది. గత రెండేళ్లలో జరిగిన వర్చువల్ ఎడిషన్‌లలో రెండు పతకాలు, బంగారు, కాంస్యాలు వచ్చాయి.

భారత క్రీడాకారులు ప్రపంచ వేదికపై కొన్ని అద్భుతమైన ప్రదర్శనలతో తమ సామర్థ్యాలను నిరూపించుకున్నారు. భారత చెస్‌కు భవిష్యత్తుగా నిలిచే కొంతమంది ప్రతిభావంతులైన యువకులు కూడా ఆవిర్భవించారు. యువ ప్రతిభను అభివృద్ధి చేయడం, వారి సామర్థ్యాలను పెంపొందించడం ఖేలో చెస్ ద్వారా సాధ్యం అవుతుందని ఏఐసీఎఫ్​ ముఖ్య అధికారి అన్నారు.  ఈ కార్యక్రమం ఆదర్శవంతమైన వేదికను అందించగలదన్న నమ్మకం ఉందని చౌహాన్ చెప్పారు.

అట్టడుగు స్థాయిలో క్రీడా సంస్కృతిని పెంపొందించే లక్ష్యంతో ఖేలో ఇండియా కార్యక్రమం 2018లో ప్రారంభమైంది. ఇంకా ఖేలో ఇండియాలో భాగం కాని చెస్ వంటి ఆట కోసం, అటువంటి మొదటి సారిగా చెస్ ఒలింపియాడ్‌ను నిర్వహించడం ద్వారా భారతదేశం తన చెస్ చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయాన్ని లిఖించడానికి సిద్ధంగా ఉంది. చెస్ ఒలింపియాడ్ యొక్క 44వ ఎడిషన్ జూలై 28 నుండి చెన్నై సమీపంలోని మహాబలిపురంలో జరగనుంది. దీనికోసం ఇప్పటికే ఢిల్లీ నుండి బయలుదేరిన టార్చ్ దేశంలోని 75 వివిధ నగరాల మీదుగా వెళుతుంది. చివరగా జూలై 27న మహాబలిపురం చేరుకుంటుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement