Wednesday, April 24, 2024

TS | ఖమ్మం ఆస్పత్రికి బీఎఫ్‌హెచ్‌ఐ గుర్తింపు.. రాష్ట్రంలో ఈ సర్టిఫికెట్‌ సాధించిన ఆరో దవాఖాన

ఖమ్మం జిల్లా దవాఖానకు ‘బ్రెస్ట్‌ ఫీడింగ్‌ ఫ్రెండ్లీ హాస్పిటల్‌’ గుర్తింపు దక్కింది. ముర్రుపాలు అందించడం, ఆరు నెలల వరకు తల్లిపాలు మాత్రమే పట్టించేలా అవగాహన కల్పించే దవాఖానలకు ‘బేబీ / బ్రెస్ట్‌ ఫీడింగ్ ఫ్రెండ్లీ హాస్పిటల్‌ ఇనిషియేటివ్‌’ (బీఎఫ్‌హెచ్‌ఐ)లో భాగంగా ఈ సర్టిఫికెట్‌ అందజేస్తారు. ఖమ్మంతో కలిపి తెలంగాణ రాష్ట్రంలో ఆరు దవాఖానలు బీఎఫ్‌హెచ్‌ఐ గుర్తింపు పొందాయి. ఈ ఏడాది ఫిబ్రవరిలో బాన్సువాడలోని ఎంసీహెచ్‌ మొదటి బీఎఫ్‌హెచ్‌ఐ సర్టిఫికెట్‌ సాధించింది. ఆ తర్వాత జనగాం ఎంసీహెచ్‌, గజ్వెల్‌ ఏరియా హస్పిటల్‌, సూర్యాపేట ఎంసీహెచ్‌, జహీరాబాద్‌ ఏరియా హాస్పిటల్‌ ఈ గుర్తింపు పొందాయి. తద్వారా దేశంలోనే అత్యధిక బీఎఫ్‌హెచ్‌ఐ అక్రిడేటెడ్‌ ప్రభుత్వ దవాఖానలున్న రాష్ట్రంగా తెలంగాణ రికార్డు సాధించింది.

సీఎం కేసీఆర్‌ నేతృత్వంలో రాష్ట్రంలోని ప్రజలకు మెరుగైన, నాణ్యమైన వైద్యసేవలు అందుతున్నాయనడానికి ఇది మరో నిదర్శనంగా నిలిచింది. బిడ్డ పుట్టిన అరగంటలోనే మ్రురుపాలు తాగించాలని, బిడ్డకు ఆరు నెలల వయసు వచ్చే వరకు తల్లిపాలు మ్రాతమే తాగించాలని అనేక అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. దీంతో ఐదేండ్లలోపు పిల్లల మరణాలను 22 శాతం నివారించవచ్చని చెప్తున్నాయి. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు ప్ర‌భుత్వం తల్లిపాల వినియోగం, శిశు మరణాల నివారణకు ప్రత్యేక కార్యాచరణ చేపట్టింది.

ఓవైపు ఎంసీహెచ్‌లు, ఎన్‌ఐసీయూలు వంటి సదుపాయాలు కల్పించింది. మరోవైపు ‘్రబెస్ట్‌ ఫీడింగ్‌ ్రపమోషన్‌ నెట్‌వర్క్‌ ఆఫ్‌ ఇండియా’ (బీపీఎన్‌ఐ) సహకారంతో 30 మంది మాస్టర్‌ ట్రెయినీలకు శిక్షణ ఇప్పించింది. ఇలా శిక్షణ ఇప్పించిన తొలిరాష్ట్రంగా రికార్డు సృష్టించింది. వారు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వైద్య సిబ్బంది, ఏఎన్‌ఎంలు, ఆశాలకు శిక్షణ ఇస్తున్నారు. వారి ద్వారా గర్భిణులకు, బాలింతలకు తల్లిపాల ఆవశ్యకతపై విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నారు.

- Advertisement -
  • ప్రసవం అయిన గంటలోపే ఆపరేషన్‌ థియేటర్‌లో లేదా ప్రసూతి గదిలో శిశువులకు ముర్రుపాలు అందిస్తే.. తల్లుల కేస్‌షీట్‌లో ప్రత్యేకంగా ఆకుపచ్చ రంగులో ఉండే బ్రెస్ట్‌ ఫీడింగ్‌ స్టాంపులు వేస్తున్నారు. తద్వారా ఎంత మంది పిల్లలకు ముర్రుపాలు అందాయో పర్యవేక్షించేందుకు అవకాశం కలిగింది.
  • తల్లిపాలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం రెండు కాంప్రహెన్సివ్‌ లాక్టేషన్‌ మేనేజ్మెంట్‌ సెంటర్లు (సీఎల్‌ఎంసీ), రెండు లాక్టేషన్‌ మేనేజ్మెంట్‌ యూనిట్లను (ఎల్‌ఎంయూ) స్థాపించింది.
  • రాష్ట్రంలోని ప్రభుత్వ దవాఖానల్లో అత్యధిక డెలివరీలు జరుగుతున్న 41 కేంద్రాలను ప్రభుత్వం గుర్తించింది. ఇక్కడ ప్రత్యేకంగా లాక్టేషన్‌ వర్కర్లను నియమించింది. వీరు మూడు షిప్టుల్లో అందుబాటులో ఉంటారు. వీరు తల్లిపాల గురించి ఏఎన్సీ, పీఎన్సీ చెకప్‌ల సమయంలో గర్భిణులు, బాలింతలకు అవగాహన కల్పిస్తారు. ఆపరేషన్‌ థియేటర్లలో, ప్రసూతి గదిలో ఉండి నవజాత శిశువులకు ముర్రుపాలు అందేలా చూస్తారు.
  • మొదటి దశలో 50 ప్రభుత్వ దవాఖానలను బీఎఫ్‌హెచ్‌ఐ గుర్తింపు సాధించాలని నిర్ణయించింది. ఇప్పటికే ఆరు దవాఖానలు అక్రిటిడేషన్‌ సాధించగా, మరో తొమ్మిది దవాఖానలు దరఖాస్తు చేసుకున్నాయి. వీటికి త్వరలోనే గుర్తింపు వస్తుందని అధికారులు చెప్తున్నారు. ఈ సర్టిఫికెట్‌ కాలపరిమితి మూడేండ్లు.

వైద్య సిబ్బందికి అభినందనలు తెలిపిన మంత్రి హ‌రీశ్‌రావు..
ఖమ్మం జిల్లా ఆసుపత్రికి బీఎఫ్‌హెచ్‌ఐ అ్రకిడేషన్‌ రావడం హర్షనీయం. దవాఖాన సిబ్బందికి ్రపత్యేక అభినందనలు. రాష్ట్రంలో మొత్తం ఆరు ప్రభుత్వ దవాఖానలు ఈ గుర్తింపు సాధించడం గొప్ప విషయం. సీఎం కేసీఆర్‌ సారథ్యంలో ర్రాష్ట ్రపజలకు మెరుగైన, నాణ్యమైన వైద్య సేవలు అందుతున్నాయని చెప్పడానికి ఇది మరో నిదర్శనం. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఇలాంటి ప్రత్యేక కార్యాచరణ ఫలితంగా రాష్ట్రంలో నవజాత శిశుమరణాలు, ఐదేండ్లలోపు పిల్లల మరణాలు తగ్గుముఖం పట్టాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement