Saturday, May 21, 2022

తేమ శాతం పేరుతో నష్టం కలిగిస్తే చర్యలు తప్పవు : మంత్రి గంగుల కమలాకర్

వైరా (ప్రభ న్యూస్): రైతు మిల్లర్ల యజమానులు రైతులకు అండగా ఉండాలని, తేమ శాతం పేరుతో రైతులకు నష్టం కలిగిస్తే చర్యలు తప్పవని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు.ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గ కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ రాష్ట్ర రవాణాశాఖమంత్రి పువ్వాడ అజయ్ కుమార్.. జిల్లా కలెక్టర్ గౌతమ్ పరిశీలించారు.ఈసందర్బంగా ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద తేమ శాతాన్ని పరిశీలించారు. ధాన్యం కొనుగోలు కేంద్రం లో మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులు తెచ్చిన ధాన్యాన్ని, రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా మిల్లులకు తరలించాలని మంత్రి అధికారులను ఆదేశించారు. తేమశాతం పేరుతో 10 కేజీలు తరుగు తీస్తోన్న రైస్ మిల్లులపై తగు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ను ఆదేశించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలు మిల్లర్ల వద్ద రైతులు పడుతున్న అవస్థలపై జిల్లా రైతు సంఘం అధ్యక్షుడు బొంతు రాంబాబు మంత్రి కి వినతిపత్రం అందజేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వరి ధాన్యానికి గిట్టుబాటు ధర కల్పించి రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటున్న మని, రైతులకు నష్టం కలిగిస్తే చర్యలు తప్పవని మంత్రి అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే లావుడ్యా రాములు నాయక్, జిల్లా కలెక్టర్ గౌతం జాయింట్ కలెక్టర్ మధుసూదనరావు ,రాష్ట్ర మార్క్ఫెడ్ వైస్ చైర్మన్ బొర్రా రాజశేఖర్, మార్కెట్ కమిటీ చైర్మన్ బిడీకే రత్నం, మున్సిపల్ కమిషనర్ వెంకటపతిరాజు, మున్సిపల్ చైర్మన్ సూతకాని జైపాల్, ప్రజాప్రతినిధులు వ్యవసాయశాఖ అధికారులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement