Thursday, April 25, 2024

కేజీఎఫ్2 ట్రైల‌ర్ రిలీజ్ డేట్ – న్యూ పోస్ట‌ర్

క‌న్న‌డ హీరో య‌ష్ కి స్టార్ డ‌మ్ తీసుకువ‌చ్చిన చిత్రం కేజీఎఫ్. ఈ చిత్రానికి సీక్వెల్ గా కేజీఎఫ్2 తెర‌కెక్కుతోంది. తాజాగా ఈ సినిమా నుంచి మరో క్రేజీ అప్డేట్‌ వచ్చింది. కేజీఎఫ్‌ 2 ట్రైలర్‌ కు ముహుర్తం ఖరారు చేస్తూ.. అప్డేట్‌ ఇచ్చింది చిత్ర బృందం. మార్చి 27 వ తేదీన సాయంత్రం 6.47 గంటలకు కేజీఎఫ్‌ 2 మూవీ ట్రైలర్‌ ను విడుదల చేయబోతున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు ఓ పవర్‌ ఫుల్‌ పోస్టర్‌ కూడా విడుదల చేసింది చిత్ర బృందం. అలాగే.. ఏప్రిల్‌ 14 వ తేదీనే కేజీఎఫ్‌ – 2 విడుదల కానున్నట్లు మరోసారి స్పష్టం చేసింది చిత్ర బృందం. ఇక ఈ అప్డేట్‌ తో..హీరో యశ్‌ ఫ్యాన్స్‌ లో నూతన ఉత్సాహం నెలకొంది.

https://twitter.com/prashanth_neel/status/1499263301523423232
Advertisement

తాజా వార్తలు

Advertisement