Thursday, April 25, 2024

కేజీఎఫ్3 కోసం – ఏ స్టార్ కాస్ట్ ని తీసుకోలేదు – నిర్మాత విజ‌య్

కేజీఎఫ్2 హిట్ట‌యిన నేప‌థ్యంలో కేజీఎఫ్3 కూడా తెర‌కెక్క‌నుంద‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. కాగా ఈ చిత్రం కోసం బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోష‌న్ ని తీసుకోనున్నార‌నే వార్త‌లు వినిపిస్తున్నాయి. వీటిపై క్లారిటీ ఇచ్చారు నిర్మాత విజ‌య్. కాగా ద‌ర్శ‌కుడు ప్రశాంత్‌ నీల్‌ సలార్‌ చిత్ర షూటింగ్‌ లో బిజీగా ఉన్నారు. నవంబర్ వరకు స‌లార్ షూటింగ్ పార్ట్ కంప్లీట్ కానుంది. తర్వాత ప్రశాంత్ నీల్ ‘కేజీఎఫ్ 3’పైనే ఫోకస్ పెట్టనున్నట్టు తెలుస్తోంది. ఈ సందర్భంగా నిర్మాత విజయ్ కరగందూర్ కేజీఎఫ్ 3పై ఇంట్రెస్టింగ్ న్యూస్ అందించారు. ఇప్పటికే కేజీఎఫ్2లో బాలీవుడ్ స్టార్స్ సంజయ్ దత్, రవీనా టండన్ ను కీలక పాత్రల్లో ఎంపిక చేశారు ప్రశాంత్ నీల్. దీంతో కేజీఎఫ్ ఛాప్టర్ 3లోనూ మరో బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ ను తీసుకోనున్నట్టు టాక్ వినిపిస్తోంది. దీనిపై నిర్మాత విజయ్ క్లారిటీ ఇచ్చారు. ‘మూడో భాగంలో అదనంగా ఇంకా ఏ స్టార్ కాస్ట్‌ ని చేర్చబోతున్నామనే దానిపై నిర్ణయం తీసుకోలేదు. చాప్టర్ 3 ఈ సంవత్సరం జరగదు. మాకు కొన్ని ప్రణాళికలు ఉన్నాయి, అయితే ప్రశాంత్ (నీల్) ప్రస్తుతం సాలార్‌తో బిజీగా ఉన్నారు. యష్ కూడా తన కొత్త చిత్రాన్ని త్వరలో ప్రకటించనున్నారు. కాబట్టి KGF3ని ప్రారంభించడానికి సరైన సమయం రావాల్సి ఉంది. అందుకే ఈ సీక్వెన్స్ లో హృతిక్ రోషన్ నటిస్తారా లేదా మరే ఇతర స్టార్స్ అన్నది ఇప్పుడే చెప్పలేం అని వివరించారు. ఒక‌వేళ హృతిక్ క‌నుక ఈ చిత్రంలో న‌టిస్తే సూప‌ర్ డూప‌ర్ హిట్ట‌నే టాక్ వినిపిస్తోంది. చూడాలి ఏమ‌వుతుందో.

Advertisement

తాజా వార్తలు

Advertisement