Saturday, April 20, 2024

కేరళలో సంపూర్ణ లాక్ డౌన్

దేశంలో కరోనా వ్యాప్తి రోజురోజుకూ వేగంగా విస్తరిస్తోంది. దీంతో కరోనా కట్టడి కోసం రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నాలు చేస్తున్నాయి. కొన్ని రాష్ట్రాలు తాత్కాలిక లాక్ డౌన్ ను ప్రకటిస్తే మరికొన్ని రాష్ట్రాలు నైట్ కర్ఫ్యూలు విధించాయి. ఈ క్రమంలో కేరళ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 8 నుండి 16 వరకు సంపూర్ణ లాక్‌ డౌన్ విధించాలని కేరళ ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది. రాష్ట్రంలో కరోనా కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో విజయన్ సర్కార్ ఈ నిర్ణయం తీసుకొంది. రాష్ట్రంలో కరోనా కేసుల విషయమై సీఎం విజయన్ అధికారులతో చర్చించారు. వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకుగాను సంపూర్ణ లాక్ డౌన్ అమలు చేయాలని నిర్ణయించారు. ఈ నెల 8వ తేదీ ఉదయం ఆరుగంటల నుండి లాక్‌ డౌన్ అమల్లోకి వస్తోందన్నారు. కాగా, బుధవారం నాడు ఒక్క రోజులోనే  కేరళలో 41,953 కరోనా కేసులు నమోదు అయ్యాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement