Sunday, April 11, 2021

కేరళ ఎన్నికల్లో గెలుస్తామన్న సీఎం పిన‌ర‌యి విజ‌య‌న్

కేరళ ఎన్నికలో పోలింగ్ కొనసాగుతోంది. ఎన్నికల్లో ఓటు వేసిన సీఎం పినరయి విజయన్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎల్డీఎఫ్‌కి అయ్యప్పస్వామి దీవెనలున్నాయని అన్నారు. ఎల్డీఎఫ్‌పై అయ్య‌ప్ప అగ్ర‌హం ఉంటుంద‌ని నాయ‌ర్ సంఘం నేత సుకుమార‌న్ నాయ‌ర్ చేసిన ఆరోప‌ణ‌ల‌పై స్పందించారు. ఆయ‌న అలా అని ఉండ‌ర‌ని, ఎందుకంటే ఆయ‌న అయ్య‌ప్ప భ‌క్తుడన్నారు…అయ్య‌ప్ప‌తో పాటు ఈనేలపై ఉన్న ఇత‌ర మ‌త‌విశ్వాసాల‌కు చెందిన దేవుళ్లు కూడా ఎల్డీఎఫ్ ప్ర‌భుత్వాన్ని దీవిస్తార‌ని విజ‌య‌న్ అన్నారు. త‌మ ప్ర‌భుత్వం ప్ర‌జ‌ల‌ను ర‌క్షిస్తోంద‌ని, ప్ర‌జ‌ల‌కు మంచి చేసే వారి ప‌ట్ల‌ దేవుళ్లు అండ‌గా ఉంటార‌ని సీఎం విజ‌య‌న్ తెలిపారు. ఇవాళ జ‌రుగుతున్న అసెంబ్లీ ఎన్నిక‌ల్లో త‌మ‌దే విజ‌యం అవుతుంద‌ని ఆయ‌న ధీమా వ్య‌క్తం చేశారు. ఇక ఎన్నిక‌ల రోజున అయ్య‌ప్ప‌స్వామి పేరును ప్ర‌స్తావించిన సీఎం విజ‌య‌న్ తీరును కాంగ్రెస్ పార్టీ ఖండించింది.

Advertisement

తాజా వార్తలు

Prabha News