Thursday, April 25, 2024

పారేకర్ కుమారుడికి కేజ్రీవాల్ ఆఫర్.. ఆప్​ లో చేరండి, టికెటిస్తాం.. బీజేపీది యూజ్ అండ్ త్రో పాలసీ..

ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ గోవా మాజీ సీఎం మనోహర్ పారికర్ కుమారుడు ఉత్పల్‌ను పార్టీలో చేరాల్సిందిగా ఆహ్వానించారు. గోవా ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థుల జాబితాలో ఉత్పల్ పారికర్ కు చోటు దక్కకపోవడంపై ఆయన ట్వీట్ చేశారు. ‘‘మనోహర్ పారికర్ ఫ్యామిలీతో కూడా బీజేపీ యూజ్ అండ్ త్రో విధానాన్ని అవలంభించడం చాలా బాధాకరం. దీనిపై గోవా ప్రజలు చాలా కోపంతో ఉన్నారు. నేను మనోహర్ పారికర్ జీని ఎప్పుడూ గౌరవిస్తాను. ఉత్పల్ జీ.. ఆప్ టిక్కెట్ మీకు ఇస్తాం.. ఈ ఎన్నికల్లో మా పార్టీ తరపున పోటీ చేయండి.. మీకు స్వాగతిస్తున్నాం”అని అర్వింద్ కేజ్రీవాల్ ట్వీట్ చేశారు.

మరోవైపు, పార్టీ టికెట్‌పై పోటీ చేసేలా ఉత్పల్ పారికర్‌ను ఒప్పించేందుకు బీజేపీ ఇంకా ప్రయత్నిస్తోందని వర్గాలు తెలిపాయి. అతని కుటుంబసభ్యులతో కూడా మాట్లాడేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయినప్పటికీ, పార్టీ నాయకుడు, అసెంబ్లీ స్పీకర్ రాజేష్ పట్నేకర్‌ను పోటీకి ఒప్పించే ప్రయత్నంలో ఉన్నందున, పారికర్‌కు బిచోలిమ్ సీటు అవకాశం లేదని బీజేపీ అంతర్గత వర్గాలు చెబుతున్నాయి.

ఒకప్పుడు తన తండ్రి ప్రాతినిధ్యం వహించిన పంజిమ్ నియోజకవర్గంలో ఉత్పల్ ఇప్పటికే ఇంటింటికీ సమావేశాలు ప్రారంభించారు. 2019లో మనోహర్ పారికర్ మరణానంతరం ఈ స్థానం నుంచి బీజేపీ యువ అభ్యర్థి సిద్ధార్థ్ కుంకాలీంకర్‌ను బరిలోకి దింపింది. గోవాలో బలమైన వ్యక్తి , మాజీ కాంగ్రెస్ నాయకుడు అటానాసియో ‘బాబుష్’ మోన్సెరట్టే ఉప ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించారు. తద్వారా ఈ నియోజకవర్గంలో జీజేపీ సీటు కోల్పోవాల్సి వచ్చింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement