Sunday, January 29, 2023

Bandi Sanjay: కేసీఆర్ అవినీతిపై కేంద్రం చర్యలు.. జైలుకెళ్లక తప్పదన్న బండి

తెలంగాణ సర్కార్ పై రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో అధికారిక దోపిడీపై కేంద్రం సీరియస్ గా ఉందని ఆయన అన్నారు. అధికారిక అవినీతికి కారకులు జైలుకెళ్లక తప్పదని హెచ్చరించారు. తెలంగాణలో అవినీతిపై కేంద్రం చర్యలకు సిద్ధమైందని స్పష్టం చేశారు. అందుకే ఫ్రంట్ లు, టెంట్ ల పేరుతో కేసీఆర్ హడావుడి చేస్తున్నారని ఆరోపించారు. భవిష్యత్తు పరిణామాలతో సానుభూతి కోసం కేసీఆర్ తాజా ఎత్తుగడలని పేర్కొన్నారు.

ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ తండ్రి లాలూ ప్రసాద్ యాదవ్ కూడా పసుగ్రాసం కుంభకోణం కేసులో జైలుకు వెళ్లి వచ్చాడని గుర్తు చేశారు. కేసీఆర్ కూడా జైలుకు వెళ్తే ఎలా వుంటుందో.. తేజశ్వి యాదవ్ నిన్న ప్రగతి భవన్ కు వచ్చి వివరించి ఉంటాడని ఎద్దేవా చేశారు. కేంద్రం జైలుకు పంపుతుందనే కమ్యూనిస్టులు, విపక్ష నేతలు కెసిఆర్ ను పరామర్శించేందుకు వస్తున్నారని బండి సంజయ్ వ్యాఖ్యానించారు. 

- Advertisement -
   

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement