Saturday, April 20, 2024

య‌వ‌త‌కు భ‌రోసా- వ‌డివ‌డిగా కెసిఆర్ అడుగులు..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ ముఖ్యప్రతినిధి: టీఎస్‌ పీఎస్సీ పేపర్‌ లీకేజీల వ్యవహారంపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ దృష్టి సారించారు. తెలంగాణ సమాజానికి ఈ అంశంపై నమ్మకం కలిగిస్తూ పరీక్షలు ఎలా నిర్వ హంచాలన్న అంశంపై నిపుణులతో చర్చిస్తున్నట్లు తెలిసింది. సోమవారం ఈ అంశంపై పలువురు నిపుణులతో మాట్లాడినట్లు తెలిసింది. ఇప్పటికే ఈ అంశంపై సిట్‌ వేసిన నేపథ్యంలో ఈ నివేదిక వచ్చాక తదుపరి చర్యలు తీసుకునే అవకాశాలు కనబడుతు న్నాయి. రద్దు చేసిన పరీక్షలను ఇప్పటికిపుడు మళ్లి పెట్టినా అనుమానాలు చెలరేగే ప్రమాదం ఉందనే అభిప్రాయం వ్యక్తమవడంతో అసలు తెలంగాణతో కేసీఆర్‌కు, గులాబీ పార్టీకి ఉన్న పేగుబంధం గుర్తు చేస్తూ బహరంగ లేఖను కేసీఆర్‌ రాశారు. మీరే నా బలం.. బలగం అంటూ సాహసమే ఊపిరిగా చేసిన ప్రయాణాన్ని గుర్తుచేశారు. వ్యూహాత్మకంగా లేఖను విడుదల చేసిన కేసీఆర్‌ క్రమంగా యువతలో నమ్మకం పాదుకొల్పే చర్యలకు పూనుకున్నారు. కొందరి తప్పుల కారణంగా.. ప్రభుత్వానికి అప్రతిష్ట వచ్చే ప్రమాదం ఉండడంతో దీని తీవ్రతను తగ్గించేందుకు సీఎం కేసీఆర్‌ అత్యంత వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. యువత హృదయాల నుండి అపోహ, అనుమానం దూరం చేసేలా బలమైన విధానం తేవాలనే ఆలోచ నతో సీఎం ఉన్నారు. ఇందు కోసం వివిధరంగాల నిపుణులతో సీఎం చర్చిస్తున్నారు.

జనవరిలో జరిగిన అంగన్‌ వాడి సంబంధించిన పోస్ట్‌ల పరీక్ష జరగ్గా, దీనిని రద్దు చేయాలనే ఆందోళ నలు జరుగుతున్నాయి. అన్ని పరీక్షలు రద్దుచేసి అత్యంత పారదర్శక విధానం తీసుకురావాలని, 90 రోజుల్లో పరీక్షలు పూర్తిచేయాలనే ఆలోచనతో సీఎం ఉన్నట్లు సమాచారం. దీనికోసం ఆర్డినెన్స్‌ ద్వారా కొత్త చట్టం తెచ్చే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. లీకేజీ వ్యవహారం ఆసరాగా చేసుకుని ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలు, విమర్శలు తిప్పికొట్టేలా కొత్త ఎత్తుగడలకు సీఎం దిగుతున్నట్లు తెలుస్తోంది. ఓవైపు విపక్షాల ఎత్తులను చిత్తుచేయడం, మరోవైపు నిరుద్యోగ యువతలో నమ్మకం కలిగించి నోటిఫికేషన్లు పూర్తిచే యడమే లక్ష్యంగా సీఎం కేసీఆర్‌ ప్రణాళికలు రూపొం దించారు. తెలంగాణలోని ప్రతీ అంశంపై తనకంటే ఎక్కువ బాధ్యత ఎవరికీ లేదని, ఉద్యమనేతగా తనకే ఇక్కడి యువతపై బాధ్యత ఉందని.. నమ్మకం కలి గించి టీఎస్పీఎస్సీ వ్యవస్థలో దొర్లిన తప్పులను సరిదిద్దేందుకు సరైన ప్రణాళిక రూపొందించమని ఇప్పటికే నిపుణులను ఆదేశించారు. ఏకకాలంలో ఉద్యోగాల ప్రక్రియ ఎలా పూర్తిచేయాలి.. ఇందుకు ఉన్న ఆటంకాలు, అవరోధాలపై నిపుణులు ఇప్పటికే సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు కసరత్తు చేస్తున్నారు. ఇతర రాష్ట్రాలలో, దేశాలలో ఉత్తమ పద్దతులను అధ్య యనం చేస్తున్నారు. సిట్‌ నివేదిక వచ్చాక.. ఈ అంశంపై సీఎం కేసీఆర్‌ స్పందించే అవకాశం ఉన్నట్లు ప్రభుత్వ వర్గాల్లో చర్చ జరుగుతోంది. గతంలో ఆర్టీసీ సమ్మెతో పాటు అనేక సంక్షోభాలను కేసీఆర్‌ తనదైన శైలిలో పరిష్కరించగా, ఈ అంశంలోనూ పరిస్థితిని అదుపులోనే ఉంచేందుకు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది.

తెలంగాణ చైతన్యం తొణికిసలాడే గడ్డ. ప్రజలే కేంద్రం బిందువుగా.. వారి సమస్యలే ఇతివృత్తంగా పనిచేస్తున్న బీఆర్‌ఎస్‌ పార్టీని తెలంగాణ సమాజం ఎన్నడూ వదులుకోదు. చిల్లర మల్లర రాజకీయ శక్తు లను ఎప్పుడూ ఆదరించదు. తెలం గాణతో బీఆర్‌ఎస్‌ పార్టీది పేగుబంధం. పురిటిగడ్డపైన మరోసారి గులాబీ పార్టీ మరోసారి బ్రహ్మాండమైన విజయం సాధించడం తథ్యం అంటూ కేసీఆర్‌ సోమవారం విడుదల చేసిన బ#హరంగలేఖలో పేర్కొనడం బీఆర్‌ఎస్‌ వర్గాలలో ఉత్సాహాన్ని నింపింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement