Wednesday, April 17, 2024

గర్జన గర్జనకు ఓ ప్రత్యేకత – నాడు ఉద్యమం కోసం.. నేడు దేశ ప్రగతి కోసం

ప్రతి సభలో ఓ సందేశం
జనంలో అడుగు పెడితే…
గులాబీ దళపతిది జైత్రయాత్రే
తిరుగులేని రాజకీయ శక్తిగా, వైఫల్యమే ఎరుగని నేతగా గుర్తింపు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ బ్యూరో: రాజకీయాలను పక్కనబెట్టి చూస్తే, ఆయన చరిత్ర ఓ పుస్తకం. సామాజిక, ఆర్థిక వెనుకబాటుతనం, యాస, ప్రాస తప్ప రాజకీయమంటే తెలియని కాలం నుంచి తెలం గాణ ప్రజల గోస ప్రత్యక్షంగా తెలిసిన రికార్డు ఆయనకే సొంతం. వెనుకబాటు-తనం నుంచి చీకటి గోడలను చీల్చుకుంటూ వెలుగులోకి వచ్చేంతవరకూ ఆయన చేసిన సాహసం మరెవ్వరూ చెయ్యలేదు. గర్జించడం తన జన్మహక్కు అన్న తరహాలో కేసీఆర్‌ ఉద్యమ చరిత్ర భావితరం నేతలకు ఆదర్శప్రాయంగా మారుతోంది. గడిచిన చరి త్రను తిరగేస్తే, ఎంతటి స్థాయిలో వెలుగొందిన నాయకుడైనా ఒక తరా నికి మాత్రమే పరిమితమయ్యాడు. కానీ, కాసుల భేరం తెలియని కాలం నుంచి ఖరీదైన రాజకీయాల దాకా… కేసీఆర్‌ అన్నీ తెలిసిన నాయకుడ య్యాడు. తెలుగు రాష్ట్రాల్లో ఎన్టీఆర్‌ తర్వాత తిరుగులేని జన ప్రభంజనం కేసీఆర్‌దే అన్న నినాదం నేడు బలంగా వినిపిస్తోంది. ఎన్ని పార్టీలు ఏకమైనా, ఉద్దండులైన నాయకులు ఎన్ని కుతంత్రాలు చేసినా కేసీఆర్‌కు ప్రజాదరణ తగ్గలేదని చెప్పడానికి విజయ దుందుభి మ్రోగించిన ఆయన గర్జనలే నిదర్శనం.

గడిచిన రెండున్నర దశాబ్దాలుగా వైఫల్యమే ఎరుగని నేతగా, 1984 నుంచి ఇప్పటిదాకా ప్రత్యక్ష రాజకీయాల్లో తలపండిన నాయకుడిగా తయకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడాయన. దేశోద్ధరణకు నేడు నెలకొల్పిన బీఆర్‌ఎస్‌ పార్టీ వ్యూహం ఫలిస్తే ఇక తిరుగులేని రాజకీయ శక్తిగా అవతరిస్తారని విశ్లేషకులు, నిపుణులు తేల్చి చెబుతు న్నారు. ఉద్యమ నేపథ్యంలో భారీ బహిరంగ సభలు నిర్వహించ డంలో కేసీఆర్‌ చరిత్ర ప్రపంచ రికార్డులనే తిరగరాసింది. అదే స్ఫూర్తితో టీ-ఆర్‌ఎస్‌ పార్టీని బీఆర్‌ఎస్‌గా మార్చి దేశం తలరాతను మార్చే పనికి శ్రీకారం చుట్టారు. ఆ పరంపరలో 2001లో కరీంనగర్‌ సింహగర్జన మొదలు 2010 డిసెంబర్‌ 16న వరంగల్‌లో జరిగిన తెలంగాణ మహా గర్జన వరకు విజయవంతమైన అనేక బహిరంగ సభలు కేసీఆర్‌ ఉద్యమ స్పూర్తిని రెట్టింపు చేశాయి. వరంగల్‌ సభ ఏకంగా ప్రపంచ రికార్డునే సొంతం చేసుకోవడంతో ఆయన ఘనత దేశవ్యాప్తమైంది. నేడు దేశాన్ని మేల్కొలిపే లక్ష్యసాధనలో కేసీఆర్‌ అదే పంథాను ఎంచుకున్నారు.
టీ-ఆర్‌ఎస్‌ పార్టీ బీఆర్‌ఎస్‌ పార్టీగా రూపాంతరం చెందాక ఖమ్మం గడ్డపై ఈనెల 18న నిర్వహించే బహిరంగ సభ మరో చరిత్రకు వేదిక కానుంది. ఇక్కడి నుంచి కేసీఆర్‌ బీఆర్‌ఎస్‌ శంఖారావం పూరించను న్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం 2001లో తెలంగాణ రాష్ట్ర సమితి పేరుతో ఒక ప్రాంతీయ పార్టీని నెలకొల్పిన కొద్ది రోజులకే 2001 ఏప్రిల్‌ 27న కరీంనగర్‌లో పార్టీ ఆవిర్భావ సభ, ఆ తర్వాత హన్మకొండలో నిర్వహించిన మరో బహిరంగ సభ ఉద్యమ చరిత్రను కీలక మలుపు తిప్పింది. అది స్థానిక సంస్థలకు ఎన్నికలకు అప్పటి ప్రభుత్వం షెడ్యూల్‌ విడుదల చేసిన రోజు. స్థానిక సమరంలోకి అడుగు పెట్టబోతున్నామని పార్టీ అధినేత కేసీఆర్‌ ప్రకటించిన రోజు. ఆ ఎన్నికల్లో పార్టీ విజయ ఢంకా మోగించి, తెలంగాణ ప్రత్యేక ఆకాంక్షను వెలుగెత్తి చాటారు. అలాగే 2003లో వరంగల్‌లో నిర్వహించిన తెలంగాణ జైత్రయాత్ర పేరుతో నిర్వహించిన భారీ బహిరంగసభ తెలంగాణ వాదాన్ని జాతీయ స్థాయిలో బలంగా వినిపించే స్థాయికి చేరింది. అంతేకాకుండా కాంగ్రెస్‌ పార్టీ అప్పటి టీఆర్‌ఎస్‌తో పొత్తు పెట్టు-కోవడం, ఆ పార్టీ నేతృత్వంలో ఏర్పా-టైన కేంద్రంలోని యూపీఏ-1 ప్రభుత్వ కనీస ఉమ్మడి ప్రణాళికలో ప్రత్యేక తెలంగాణ అంశానికి చోటు- సాధించడం.. ఇవన్నీ ఆయన విజయోత్సాహానికి సంకేతాలుగా మారాయి.
ఆ తర్వాత రాష్ట్రపతి ప్రసంగంలోనూ తెలంగాణ ఏర్పాటు- అంశం చేర్చేలా ఆనాటి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేశాయి. మహబూబ్‌నగర్‌ జిల్లాలో నిర్వహించిన భారీ బహిరంగసభ అప్పటి రాష్ట్ర ప్రభుత్వం పాలమూరు ఎత్తిపోతల పథకం చేపట్టేలా చేసిందనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. భూపాలపల్లిలో నిర్వహించిన మరో బహిరంగ సభ కాకతీయ థర్మల్‌ పవర్‌ ప్రాజెక్టు నిర్మాణానికి దోహదపడింది. టీ-ఆర్‌ఎస్‌ పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలను నాటి సీఎం వైఎస్సార్‌ కొను గోలు చేసి తెలంగాణ వాదం లేదని నిరూపించే ప్రయత్నం జరిగిన సందర్భంలోనూ కేసీఆర్‌ రాజకీయంగా వెనుకడుగు వేయలేదు. 2007లో వరంగల్‌లోని ప్రకాశ్‌రెడ్డిపేటలో తెలంగాణ విశ్వరూప సభ నిర్వహించి, నేతలు అమ్ముడుపోయినా పర్వాలేదు, కానీ ప్రజలుగా తెలంగాణ వాదానికే కట్టు-బడి ఉన్నామని దృఢ సంకల్పంతో ప్రకటించి కోట్లాది మంది ప్రజల ఆదరాభిమానాలు చూరగొన్నారు.
2009 డిసెంబర్‌ 9న యూపీఏ సర్కారు ప్రత్యేక తెలంగాణ ప్రకటన చేయడం వెనుక కేసీఆర్‌ ఉద్యమ స్పూర్తి, పోరాటం ఏమాత్రం ఉన్నదో… దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. వరంగల్‌లోని ప్రకాశ్‌రెడ్డి పేటలో 2010 డిసెంబర్‌ 16న నిర్వహించిన తెలంగాణ మహాగర్జన బహిరంగసభ ప్రపంచంలోనే టాప్‌ -టె-న్‌ జన సమీకరణల్లో ఒకటిగా రికార్డు సృష్టించింది.
1930లో జాతిపిత మహాత్మాగాంధీ నిర్వహించిన దండి ఉప్పు సత్యాగ్రహం, అమెరికాలో మార్టిన్‌ లూథర్‌ కింగ్‌ సభ ఇలా.. ప్రపం చంలోనే అతిపెద్ద జనసమీకరణల జాబితాలో తెలంగాణ మహాగర్జన కూడా ఒకటని అంతర్జాతీయ దినపత్రిక న్యూయార్‌ -టైమ్స్‌ ప్రత్యేక కథనం ప్రచురించింది. అనేక ఉద్యమాలు, ఆత్మ బలిదానాల పలి తంగా తెలంగాణ రాష్ట్రం సిద్దించిన తర్వాత ఏర్పాటు- అనంతరం 2017 ఏప్రిల్‌ 27న వరంగల్‌లో 16వ వార్షికోత్సవం నిర్వహించిన టీ-ఆర్‌ఎస్‌ పార్టీ అధినాయకుడు వ్యవసాయరంగం, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపే తానికి చేపట్టే చర్యలను ముందుచూపుతో ఆనాడే వెల్లడించారు. 2018 సెప్టెంబర్‌ 2న కొంగర కలాన్‌లో నిర్వహించిన ప్రగతి నివేదన సభలో తెలంగాణ ఆత్మ గౌరవాన్ని వెలుగెత్తి చాటారు.

కెసిఆర్ స‌భ‌ల మైలు రాళ్లు..

- Advertisement -

2001, మే 17న కరీంనగర్‌లో సింహగర్జన (హాజరైన నేత జేఎంఎం శిబూసోరెన్‌).
అదే ఏడాది జూన్‌ 1 మహబూబ్‌నగర్‌లో బహిరంగ సభ, ఆ సరుసటి రోజే జూన్‌ 2న నల్గొండలో బహిరంగ సభ.
జూన్‌ 4న నిజామాబాద్‌లో బహిరంగసభ,
జూన్‌ 5న నిర్మల్‌లో మరో బహిరంగ సభ.
నవంబర్‌ 17 ఖమ్మంలో ప్రజాగర్జన పేరుతో భారీ బహిరంగ సభ.
2002, మార్చి 27న వికారాబాద్‌లో సమర శంఖా రావం, అదే ఏడాది అక్టోబర్‌ 28న భూపాలపల్లిలో బహిరంగ సభ.
2003, జనవరి 6న సికింద్రాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్స్‌లో తెలంగాణ గర్జన.
ఏప్రిల్‌ 27న వరంగల్‌లో తెలంగాణ జైత్రయాత్ర (పాల్గొన్న నేతలు దేవేగౌడ, అజిత్‌సింగ్‌).
జూన్‌ 30న చలో జగిత్యాల బహిరంగసభ
నవంబర్‌ 19న సంగారెడ్డిలో సింగూరు సింహగర్జన.
నవంబర్‌ 21న పాలమూరు సింహగర్జన
డిసెంబర్‌ 3న ఇందూరు సింహగర్జన, డిసెంబర్‌ 5న ఓరుగల్లు వీరగర్జన, డిసెంబర్‌ 16న సిరిసిల్లలో కరీంనగర్‌ కదనభేరి
2004, డిసెంబర్‌ 11న సికింద్రాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్స్‌లో భారీ బహిరంగసభ. (హాజరైన నేతలు అజిత్‌సింగ్‌, ముఫ్తీ మహమ్మద్‌ సయీద్‌, డాక్టర్‌ రాందాస్‌ అథవాలే, పీ రాందాస్‌ (పీఎంకే), డాక్టర్‌ కృష్ణన్‌ (ఎండీఎంకే)).
2005, జులై 17న వరంగల్‌లో బహిరంగ సభ. (పాల్గొన్న నేత శరద్‌పవార్‌)
2006, ఫిబ్రవరి 12న భద్రాచలంలో పోలవరం గర్జన. (హాజరైన నేత శిబూసోరెన్‌)
2007, ఏప్రిల్‌ 27న వరంగల్‌లో తెలంగాణ విశ్వరూప సభ.
2008, ఫిబ్రవరి 19న కరీంనగర్‌ భారీ బహిరంగ సభ.
2009, అక్టోబర్‌ 21న సిద్దిపేటలో ఉద్యోగ గర్జన.
2010, జనవరి 31న హైదరాబాద్‌ ఓల్డ్‌ సిటీ-లో ముస్లిం జాక్‌
ఫిబ్రవరి 7న తెలంగాణ పొలికేక. (పాల్గొన్న నేత స్వామి అగ్నివేశ్‌)
మే 2న పాలమూరు గర్జన. జులై 15న సిద్దిపేట బహిరంగ సభ.
డిసెంబర్‌ 16న వరంగల్‌లో తెలంగాణ మహాగర్జన. (పాల్గొన్న నేత స్వామి అగ్నివేశ్‌)
2023, ఈ నెల 18న ఖమ్మంలో ‘భారత సింహగర్జన’ (పాల్గొననున్న నేతలు అరవింద్‌ కేజ్రీవాల్‌, భగవంత్‌సింగ్‌ మాన్‌, పినరాయి విజయన్‌, అఖిలేష్‌ యాదవ్‌)

Advertisement

తాజా వార్తలు

Advertisement