Friday, April 19, 2024

కత్రినా, కరీనా.. ఇవన్నీ డ్రగ్స్ పేర్లు.. హైదరాబాద్‌లో పట్టుబడిన ముఠా.. స్కూల్‌ పిల్లలతో దందా..

హైదరాబాద్‌లో డ్రగ్స్ ముఠా పట్టుబడింది. దీనికి సంబంధించిన సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. స్కూల్‌ పిల్లలతో డ్రగ్స్ ను సరఫరా చేపిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ముంబైలో సప్లై చేసే డ్రగ్స్ కి హీరోయిన్ల పేర్లతో కోడ్‌ లాంగ్వేజ్ సెట్‌ చేసుకున్నారు. కత్రినా, కరీనా, సల్మాన్ పేర్లతో ముంబైకి డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. ఇటు హైదరాబాద్‌లో సప్లై చేసే డ్రగ్స్ కి సినిమా పేర్లతో కోడ్ లాంగ్వేజ్ ఫిక్స్‌ చేసుకున్నారని పోలీసులు చెబుతున్నారు.

ఆర్డీఎక్స్‌, ఎండీ, స్టఫ్, మాల్‌ పేర్లతో హైదరాబాద్‌లో డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు పోలీసులు ఎంక్వైరీలో తెలిసింది. గోవా, ముంబై నుంచి హైదరాబాద్‌కు తరలిస్తున్న డ్రగ్స్ వ్యాపారులు ఇక్కడ 5 రెట్ల లాభంతో అమ్మకాలు జరుపుతున్నట్లు విచారణలో బయటపడింది. అయితే హైదరాబాద్ డ్రగ్స్ వ్యాపారంలో కీలకంగా ఉన్న ఐదుగురు సూత్రధారులను పట్టుకునేందుకు పోలీసులు వేట ముమ్మరం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement