Friday, April 26, 2024

Warning: కాశీ పిక్నిక్ స్పాట్ కాదు.. హిందూయేతరులు ‘ఘాట్’కు రావొద్దంటూ పోస్టర్లు!

హిందూయేతరులు గంగానది ఘాట్లకు, నది ఒడ్డున ఉండే ఆలయాలకు రాకుండా దూరంగా ఉండాలని హెచ్చరిస్తూ కాశీ వీధుల్లో పోస్టర్లు వెలిశాయి. ఈ వాల్ పోస్టర్లను తొలగించిన పోలీసులు ఈ పని చేసింది ఎవరూ అనేదానిపై విచారణ చేపట్టారు. జాతీయ వాద సంస్థలు వీటి వెనుక ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. గంగా ఘాట్లు, కాశీ దేవాలయాలు సనాతన ధర్మానికి, భారతీయ సంస్కృతికి, విశ్వాసానికి, నమ్మాకానికి చిహ్నాలు. వీటిపై నమ్మకం ఉన్నవారికి స్వాగతం, లేని వారికి ఇది పిక్నిక్ స్పాట్ కాదని హిందూయేతరులు రావొద్దని హెచ్చరికతో కూడిన సందేశం ఈ పోస్టర్లలో ఉంది.

అయితే.. విశ్వహిందూ పరిషత్ (VHP), దాని యువజన విభాగం, బజరంగ్ దళ్ ద్వారా ఇట్లాంటి పోస్టర్ల, ఫొటోలు, వీడియోలు కూడా సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో షేర్ అవుతున్నాయి. కొంతమంది వీహెచ్ పీ లీడర్లు, యువకులు పోస్టర్లు ప్రదర్శిస్తూ.. గోడలకు అంటిస్తూ కనిపించడం గమనార్హం.

Advertisement

తాజా వార్తలు

Advertisement