Thursday, March 28, 2024

క‌శ్మీర్ ఫైల్స్ సినిమా అయిన‌ప్పుడు ల‌ఖీంపూర్ ఫైల్స్ కూడా సినిమానే – ‘అఖిలేశ్ యాద‌వ్’

యూపీ ఎన్నిక‌ల్లో ఓట‌మి త‌ర్వాత ఫ‌స్ట్ టైం మీడియా ముందుకు వ‌చ్చారు స‌మాజ్ వాదీ అధ్య‌క్షుడు అఖిలేశ్ యాద‌వ్. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ..క‌శ్మీర్ ఫైల్స్ సినిమా అయిన‌ప్పుడు ల‌ఖీంపూర్ ఫైల్స్ కూడా సినిమా అవుతుందంటూ వ్యాఖ్యానించారు. ఈ సంద‌ర్భంగానే ఆయ‌న క‌శ్మీర్ ఫైల్స్ సినిమా గురించి పై విధంగా వ్యాఖ్యానించారు.యూపీ ఎన్నిక‌ల్లో నైతిక విజ‌యం త‌మ‌దేన‌ని అఖిలేశ్ స్ప‌ష్టం చేశారు. బీజేపీ పాలించి ఇన్ని సంవ‌త్స‌రాలు గ‌డుస్తున్నా… ఇంకా మౌలిక స‌దుపాయాల స‌మ‌స్య‌లే వున్నాయ‌ని ఎద్దేవా చేశారు. స‌మాజ్‌వాదీ పెరుగుతూనే వుంద‌ని, బీజేపీ త‌గ్గుతూ వ‌స్తోంద‌ని అన్నారు. ఈ ఎన్నిక‌ల్లో త‌మ ఓట్ల శాతం బాగా పెరిగింద‌ని, దీన్ని బ‌ట్టే నైతిక విజ‌యం స‌మాజ్‌వాదీకి ద‌క్కుతుంద‌ని అఖిలేశ్ పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement