Wednesday, April 24, 2024

ఆరనీకుమా ఈ దీపం: రేపు కార్తీక పౌర్ణమి.. స్పెషాలిటీ ఏంటో తెలుసా!

ప్రతి ఏడాదిలో వచ్చే ‘కార్తీక మాసం’ విష్ణువు, శివునికి కూడా చాలా ప్రీతికరమైనది. కార్తీక మాసంలో ముఖ్యంగా ‘పౌర్ణమి’ రోజు శ్రీ మహా విష్ణువు మత్స్యావతారం తీసుకుంటాడని భక్తులు నమ్ముతారు. అలానే కార్తీక పౌర్ణమి రోజున దేవతలు భూమిపై ఉన్న గంగానదిలో స్నానం చేస్తారని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. అందుకే ఈ రోజున ప్రజలు గంగానది వద్ద స్నానం చేసి దీపాలు వెలిగిస్తారు. అంతటి విశిష్టత ఉన్న కార్తీక పౌర్ణమి.. ఈ సంవత్సరం నవంబర్ 8న వచ్చింది. 

కార్తీక పౌర్ణమి 2022 నవంబర్ 7న సాయంత్రం 4:15 గంటలకు ప్రారంభమయి.. మరుసటి రోజు నవంబర్ 8వ తేదీన సాయంత్రం 4:31 గంటలకు ముగుస్తుంది. కార్తీక పౌర్ణమి నాడు ప్రజలంతా మహావిష్ణువు, లక్ష్మిదేవిని అత్యంత భక్తి శ్రద్దలతో పూజిస్తారు. ఇలా చేయడం వలన లక్ష్మిదేవి ఇంటికి వస్తుందని భక్తులు నమ్ముతారు.

కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ రోజున ప్రజలు ఆలయంలో విష్ణువు సమేతంగా లక్ష్మీదేవిని పూజిస్తారు. కార్తీక పౌర్ణమి నాడు దీపదానం చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందని నమ్మకం. ‘‘కార్తీక పౌర్ణమి రోజున స్వహస్తాలతో పిండి దీపం చేసి.. అందులో 7 లవంగాలు వేసి ప్రధాన గుమ్మం వద్ద ఉంచండి. ఇలా చేయడం వలన లక్ష్మీ దేవి సంతోషిస్తుంది. అలాగే తులసి మాత ముందు నెయ్యి దీపం వెలిగించి.. విష్ణువు మరియు లక్ష్మీ దేవిని పూజించండి.”మంచి ఫలితాలు పొందుతారు అని పలువురు పూజారులు, పండితులు చెబుతున్నారు.

- Advertisement -

ఇక.. కార్తీక పౌర్ణమి రోజున మామిడి ఆకులతో తోరణం తయారు చేసి ఇంటి ప్రధాన ద్వారానికి కడితే ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ వస్తుందని నమ్మకం. అదేవిధంగా ప్రధాన ద్వారం వద్ద పసుపుతో స్వస్తిక్ తయారు చేసి పెట్టడం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుందని చెబుతున్నారు. ఇక శివునికి పాలు, పెరుగు, గంగాజలంతో అభిషేకం చేయడం చాలా శుభప్రదం అంటున్నారు వేద పండితులు.  

Advertisement

తాజా వార్తలు

Advertisement