Saturday, April 20, 2024

పునీత్ కి క‌ర్నాట‌క ర‌త్నఅవార్డ్.. సంస్మరణ సభకు 1500మంది అతిథులు..

దివంగ‌త న‌టుడు..క‌న్న‌డ ప‌వ‌ర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ కి కర్ణాటక రత్న అవార్డు ఇవ్వనున్నట్లుగా కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై తెలిపారు. బాలనటుడిగా జాతీయ అవార్డు అందుకున్న ఏకైక అబ్బాయి పునీత్ అని.. తనకు చిన్నప్పటి నుంచి పునీత్ తెలుసునని.. చిన్నవయసులోనే అద్భుతమైన నటనతో ప్రేక్షకులను మెప్పించాడని ముఖ్యమంత్రి అన్నారు.పునీత్ మృతి చెంది రెండు వారాలు పూర్తి కావోస్తున్నా ఇప్పటికీ ఆయన సమాధి వద్దకు వేలాదిగా అభిమానులు తరలివస్తున్నారు. కేవలం రీల్ హీరోగానే కాకుండా.. నిజ జీవితంలోనూ పునీత్ హీరోనే. సామాజిక సేవలతోపాటు.. ఎంతోమంది అభాగ్యులకు అండగా నిలిచారు. దివంగత నటుడు పునీత్ రాజ్ కుమార్ గౌరవార్థం.. నేడు సంస్మరణ సభ నిర్వహిస్తున్నారు.

ఆయన చేసిన సేవలను.. సంస్మరణ సభలో వెల్లడించనున్నారు. దాంతో నేడు కన్నడ చిత్రపరిశ్రమను తాత్కాలికంగా మూసివేశారు. దాదాపు ఈ సభను 3 గంటలపాటు నిర్వహిస్తారు. బెంగుళూరులోని ప్యాలెస్ గ్రౌండ్స్ లో సాయంత్రం 6 గంటల వరకు పునీత్ నమన అనే పేరుతో ఈ సంస్మరణ సభ కార్యక్రమాన్ని కర్ణాటక ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ (KFCC), శాండల్ వుడ్ ఫిల్మ్ యాక్టర్స్, టెక్నీషియన్స్ అసోసియేషన్స్ కలిసి నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మైతోపాటు పలువురు మంత్రులు, రాజకీయ నాయకులు హాజరయ్యారు. అలాగే ఈ కార్యక్రమానికి పునీత్ కుటుంబసభ్యులు సైతం వచ్చారు. దాదాపు ఈ కార్యక్రమానికి 1500 మంది అతిథులు విచ్చేశారు. కోలీవుడ్ సినీ ప్రముఖులతోపాటు.. టాలీవుడ్ సినీ ప్రముఖులు కూడా హజరయ్యారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌, ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

https://twitter.com/AndhraPrabhaApp, https://www.facebook.com/andhraprabhanewsdaily

Advertisement

తాజా వార్తలు

Advertisement