Friday, April 26, 2024

కేబినెట్​ విస్తరణపై ఆశలు.. పార్టీ పెద్దల నుంచి గ్రీన్​ సిగ్నల్​కోసం వెయిటింగ్​

పార్టీ పెద్దలు గ్రీన్​ సిగ్నల్​ ఇవ్వగానే మంత్రి వర్గ విస్తరణ ఉంటుందని కర్నాటక సీఎం బసవరాజ్​ బొమ్మై చెప్పారు. కర్నాటకలో మంత్రివర్గ విస్తరణ జరుగుతుందని చాలా కాలంగా ఊహాగానాలు వినిపిస్తున్న నేపథ్యంలో ఆయన ఆదివారం ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించారు. బీజేపీ ఉన్నతాధికారులు ఆదేశాలు ఇచ్చిన తర్వాత మంత్రివర్గ విస్తరణపై నిర్ణయం తీసుకుంటామని బొమ్మై తెలిపారు. అయితే నిన్న (శనివారం) జరిగిన కోర్ కమిటీ భేటీలో సీఎం బొమ్మై, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ఇన్‌ఛార్జ్ అరుణ్ సింగ్, మాజీ సీఎం బీఎస్ యడియూరప్ప, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు నళిన్ కుమార్ కటీల్ పాల్గొని పలు అంశాలపై చర్చించారు.

పార్టీ కోర్ కమిటీ సమావేశం ముగిసింది. దీనిపై ఉన్నతాధికారులు దృష్టి సారిస్తున్నారు. అనేక ఎన్నికల తేదీలను ప్రకటించారు. కాబట్టి దీన్ని దృష్టిలో ఉంచుకుని వారు ఓ నిర్ణయం తీసుకుంటారు. చాలా మటుకు నేను రేపు లేదా మరుసటి రోజు వారిని [బిజెపి నాయకులను] ఫోన్‌లో సంప్రదిస్తాను. వారి ఆదేశాల మేరకు కేబినెట్‌ విస్తరణపై నిర్ణయం తీసుకుని సన్నాహాలు ప్రారంభిస్తాం అని సీఎం బొమ్మై తెలిపారు. అయితే కొందరు బీజేపీ నేతలు ఇప్పటికే కేబినెట్ బెర్త్ లు, నిర్దిష్ట శాఖల కోసం లాబీయింగ్ ప్రారంభించినట్టు తెలుస్తోంది.

ఈసారి తనకు కచ్చితంగా మంత్రి వర్గంలో చాన్స్​ ఉంటుందని. ఈ విషయాన్ని హైకమాండ్ నిర్ణయిస్తుందని.. కొత్త వారికి అవకాశం ఇవ్వక తప్పదనే చర్చ పార్టీలో నడుస్తోందని హవేరీ ఎమ్మెల్యే నెహరు ఓలేకర్ బహిరంగంగానే చెబుతున్నారు. కొత్తవారికి అవకాశం ఇచ్చి సీనియర్లను ఒప్పిస్తామంటూ పార్టీ నేతలనుంచి తనకు సమాచారం ఉందన్నారు. అయితే.. మే 22 నుండి 26 వరకు వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ (WEF) వార్షిక సమావేశం కోసం CM బసవరాజ్ బొమ్మై దావోస్‌కు వెళ్లే అవకాశం ఉన్నందున ఆ తర్వాత మంత్రివర్గ విస్తరణ జరుగుతుందని అంతా అనుకుంటున్నారు. కాగా, శనివారం జరిగిన కోర్ కమిటీ సమావేశంలో సీఎం బొమ్మై, ఇతర నేతలు త్వరలో జరగనున్న విధాన పరిషత్, రాజ్యసభ ఎన్నికలపై కూడా చర్చించారు. మండలి, రాజ్యసభ ఎన్నికలకు అభ్యర్థుల జాబితాను నేతలు బీజేపీ హైకమాండ్‌కు పంపినట్లు సమాచారం.

Advertisement

తాజా వార్తలు

Advertisement