Thursday, March 28, 2024

ఈటలపై వేటుకు రంగం సిద్ధం.. టీఆర్ఎస్ నుండి సస్పెండ్ కు నిర్ణయం!

మాజీ మంత్రి ఈటల రాజేందర్‌పై వేటుకు రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. భూ కబ్జా ఆరోపణలపై ఇప్పటికే మంత్రిపదవి నుంచి బర్తరఫ్‌ చేసిన సీఎం కేసీఆర్… ఈటలను పార్టీ నుంచి సస్పెండ్‌ చేయాలని భావిస్తున్నారు. ఈటలను పార్టీ నుంచి సస్పెండ్‌ చేయాలని కరీంనగర్ టీఆర్ఎస్‌ నేతలు తీర్మానం చేశారు. తీర్మానం కాపీని టీఆర్ఎస్ అధిష్టానానికి పంపారు. తీర్మానంపై మంత్రులు, ఎమ్మెల్యేలు సంతకం చేశారు. ఈ లేఖపై మంత్రులు గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యేలు విద్యాసాగర్ రావు, రసమయి, మాజీ ఎంపీ వినోద్ తదితరులు సంతకాలు కూడా చేసినట్టు తెలుస్తోంది. ఈటల రాజేందర్ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడారని ఉమ్మడి కరీంనగర్ నేతలు సీఎం కేసీఆర్‌కు రాసిన లేఖలో పేర్కొన్నారు. మంత్రివ‌ర్గం నుండి తొల‌గించిన త‌ర్వాత ఈట‌ల మాట‌లు కేసీఆర్ నాయ‌క‌త్వాన్నే ప్ర‌శ్నించే విధంగా ఉన్నాయంటూ ఉమ్మ‌డి క‌రీంన‌గ‌ర్ జిల్లా టీఆర్ఎస్ నేత‌లు మండిపడుతున్నారు. పార్టీ వ్య‌తిరేక చ‌ర్య‌ల‌కు పాల్ప‌డుతున్నారంటూ ఆయ‌న్ను పార్టీ నుండి కూడా స‌స్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. దీంతో ఈటెల రాజేందర్ మీద వేటుకు రంగం సిద్ధమైనట్లు అర్థమవుతోంది. పార్టీ నుంచి ఆయన పంపించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఈటల రాజేందర్  ఇప్పటి వరకు పార్టీకి, ఎమ్మెల్యే పదవులకు రాజీనామాలు సమర్పించలేదు. క‌రీంన‌గ‌ర్ జిల్లా నేత‌ల నుండి ఈట‌ల‌ను స‌స్పెండ్ చేయాల‌న్న సంత‌కాలు సేక‌రించిన పార్టీ అధిష్టానం… ఆ సిఫార్సు ఆధారంగా పార్టీ నుండి బ‌హిష్క‌రణ ప్ర‌క‌ట‌న అవకాశం ఉంది. అయితే, నేరుగా పార్టీ నుండి బ‌హిష్క‌రిస్తే… ఈట‌ల ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేస్తారా ? అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అవ‌స‌రం అయితే పార్టీ నేత‌ల‌తో ప్రెస్ మీట్ పెట్టి రాజీనామాకు డిమాండ్ చేసి, ఆ త‌ర్వాత బ‌హిష్క‌రణ వేటు వేయాల‌న్న ఆలోచ‌న కూడా ఉంద‌న్న ప్ర‌చారం జ‌రుగుతుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement