Wednesday, April 24, 2024

యువ‌కుడిని రోడ్డుపైనే చితకొట్టిన‌ సినీ నటి కరాటే కల్యాణి

బిగ్ బాస్ ఫ్రేమ్ క‌రాటే క‌ల్యాణి మ‌రోసారి వార్త‌ల్లో నిలిచింది. ప్రాంక్ పేరుతో మహిళలతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని ఆరోపిస్తూ యూట్యూబ్ ప్రాంక్‌స్టర్ శ్రీకాంత్ రెడ్డిపై దాడి చేసింది. నడిరోడ్డుపై అతడిని పట్టుకుని చితకబాదింది. ఈ ఘ‌ట‌న‌ హైదరాబాద్ లోని మధురానగర్‌లో జరిగింది.

నిన్న శ్రీకాంత్‌రెడ్డి ఇంటికి వెళ్లిన కల్యాణి.. ప్రాంక్ వీడియోల విషయమై మండిప‌డింది. ప్రాంక్ వీడియోల పేరుతో మహిళలతో అసభ్యంగా ప్రవర్తించడం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ క్రమంలో ఇద్దరి మధ్య మాటామాట పెరిగింది. అది ఘర్షణకు దారితీసింది. ఈ క్రమంలో మధురానగర్ రోడ్డులో శ్రీకాంత్ రెడ్డి చెంప చెళ్లుమనిపించింది. ఆ సమయంలో అక్కడున్న వారు కూడా శ్రీకాంత్‌రెడ్డిపై దాడి చేశారు. అనంత‌రం ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్‌లో శ్రీకాంత్‌పై ఫిర్యాదు చేసింది. అయితే, ప్రతిగా శ్రీకాంత్ కూడా పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement