Thursday, April 18, 2024

కాన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్ లో క‌న్నుగీటిన – దీపిక ప‌దుకొనే

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపిక ప‌దుకొనే ప్రస్తుతం ఆమె స్టార్ హీరో ప్రభాస్‌తో ప్రాజెక్ట కే చిత్రంలో నటిస్తుంది. నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో రూపొందిస్తున్న సైన్స్ ఫిక్షన్‌ చిత్రమిది. అమితాబ్‌ బచ్చన్‌ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇందులో మరో పాత్రలో దిశా పటానీ యాక్ట్ చేస్తుంది. శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది.కాగా బ్లాక్ ట్రెండీ డ్రెస్ ధ‌రించి ఎర్ర తివాచీకి స‌రికొత్త అందాలు తీసుకువ‌చ్చింది బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపిక ప‌దుకొణే.. డార్క్ లుక్‌లో,కన్నుగీటుతూ వరల్డ్ ఆడియెన్స్ ని ఫిదా చేసింది. దీపికా పదుకొనె 2022 కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో సందడి చేసింది. ఆమె ఈ సారి కాన్స్ జ్యూరి సభ్యురాలిగా ఉన్నారు. ప్రారంభం నుంచి కాన్స్ ఫెస్టివల్‌లో కనువిందు చేస్తూనే ఉంది. ఆమె రెడ్‌ కార్పెట్‌పై హోయలు పోయింది. దీపికా రెడ్‌ కార్పెట్‌పై ఫ్రంట్.. బ్యాక్‌ చూపిస్తూ ఫోటోలకు పోజులివ్వడం విశేషం. ప్రస్తుతం దీపికా పదుకొనె రెడ్‌ కార్పెట్‌ వాక్‌ ఫోటోలు సామాజిక మాధ్యమాలను ఊపేస్తున్నాయి.. ఇప్పటి వరకు ఇండియా నుంచి ప్రపంచ సుందరి ఐశ్వర్యరాయ్‌, తెలుగు హీరోయిన్లు పూజా హెగ్డే, తమన్నా, హినా ఖాన్‌ సందడి చేశారు. రెడ్‌ కార్పెట్‌పై హోయలు పోయారు. కానీ వారిని మించిన స్పెషల్‌ ఎట్రాక్షన్‌ అవుతుంది దీపికా. దీపికా పదుకొనె కాన్స్ 2002 సభ్యురాలు కావడంతో ఆమె ప్రారంభం నుంచి అక్కడే సందడి చేస్తున్నారు. ఈ సారి ఇండియాకి ప్రత్యేక స్థానం కల్పిస్తూ పెవిలియన్‌ ఏర్పాటు చేశారు. అందులో ఇండియన్‌ సినిమా గొప్పతనాన్ని చాటుతుంది దీపికా. ఇండియన్‌ సినిమాలోని మార్పులను ప్రపంచానికి చాటి చెబుతుంది. ఈ క్రమంలో ఆమె ప్రతి రోజు ట్రెండే వేర్‌లో ముస్తాబై ఫోటోలకు పోజులిస్తుంది. వాటిని సోషల్‌ మీడియా వేదికగా పంచుకుంటుంది. అభిమానులను అలరిస్తుంది. ఇలా ప్రతి రోజు ఇంటర్నెట్‌లో రచ్చ చేస్తుంది దీపికా. దీపికా పదుకొనె బాలీవుడ్‌లోనూ బిజీగా ఉంది. లేడీ ఓరియెంటెడ్‌ చిత్రాలకు కేరాఫ్‌గా నిలుస్తున్న దీపికా ప్రస్తుతం కమర్షియల్‌ చిత్రాల్లో భాగమైంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement