Tuesday, April 23, 2024

క‌న్న‌డ స్టార్ య‌శ్ బ‌ర్త్ డే – కేజీఎఫ్2 నుండి పోస్ట‌ర్ రిలీజ్

నేడు క‌న్న‌డ స్టార్ య‌శ్ పుట్టిన‌రోజు. ఈ సంద‌ర్భంగా కేజీఎఫ్2 చిత్రం నుండి పోస్ట‌ర్ ని రిలీజ్ చేశారు. ఇప్ప‌టికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం విడుద‌ల‌కి సిద్ధంగా ఉంది. కానీ క‌రోనా వ‌ల్ల వాయిదా ప‌డుతూ వ‌స్తోంది. కాగా ఈ చిత్రం నుంచి విడుదలైన పోస్టర్స్, టీజర్ కేజీఎఫ్ 2 పై మరింత క్రియేట్ చేశాయి. దీంతో ఈ సినిమా కోసం పాన్ ఇండియా వ్యాప్తంగా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 2022 ఏప్రిల్ 14న విడుదల కాబోతున్నట్లుగా మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. అయితే మరోసారి సినిమా వాయిదా పడొచ్చు అంటూ వార్తలు వినిపించాయి.

తాజాగా యశ్ కు బర్త్ డే విషెస్ చెప్తూ.. రిలీజ్ డేట్ లో ఎలాంటి మార్పు లేదని క్లారిటీ ఇచ్చారు మేకర్స్. కేజీఎఫ్ కు సీక్వెల్ గా రూపొందిన కేజీఎఫ్ 2 విడుదల తేదీ విషయంలో ఇప్పటికే పలు సార్లు మార్పు వచ్చింది. కరోనా కారణంగా వాయిదా పడుతూ వస్తున్న ఈ సినిమా బిజినెస్ కూడా భారీగానే జరుగుతుంది.ఇక ఈ సినిమాలో విలన్ గా నటిస్తునందు బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్.ఇక ఈ సినిమా అన్ని కార్యక్రమాలు పుర్తి చేసుకొని విడుదల కోసం సన్నాహాలు చేస్తున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement