Thursday, April 18, 2024

క‌న్న‌డ స్టార్ సుదీప్ – సినీ ప్ర‌స్థానానికి 26ఏళ్ళు

క‌న్న‌డ స్టార్ హీరో సుదీప్ తెలుగు వారికి సుప‌రిచితుడే. తెలుగులో ప‌లు చిత్రాల్లో న‌టించాడాయ‌న‌. కాగా హీరోగా ఆయ‌న 26ఏళ్ల‌ని పూర్తి చేసుకున్నాడు. క‌న్న‌డ‌తో పాటు తెలుగు, తమిళ .. హిందీ భాషల్లోను నటించి మెప్పించారు.ఈ సందర్భంగా ఆయన భార్య ప్రియా.. సుదీప్ సోషల్ మీడియా ద్వారా అభినందనలు అందజేశారు. ఆయన సక్సెస్ ఫుల్ జర్నీ తమకి ఎంతో సంతృప్తిని ఇస్తుంద‌న్నారు. ఇకపై కూడా ఆయన అదే హార్డ్ వర్క్ తో .. అంకితభావంతో ముందుకు వెళ్లాలనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. అందుకు సుదీప్ స్పందిస్తూ .. ప్రతి అడుగులో ఆమె తనకి తోడు నీడగా నిలవడం వల్లనే ఈ ప్రయాణం ఇక్కడి వరకూ కొనసాగిందని చెబుతూ కృతజ్ఞతలు తెలియజేశాడు.

సుదీప్ పాన్ ఇండియా మూవీగా రూపొందిన ‘విక్రాంత్ రోణ’ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. కన్నడలో సుదీప్ తన కెరియర్ ను మొదలుపెట్టేనాటికి అక్కడ స్టార్ హీరోలు రంగంలో ఉన్నారు. భారీ విజయాలను తమ ఖాతాలో వేసుకుని ప్రేక్షకుల హృదయాలను పరిపాలిస్తున్నారు. అప్పటికే మహామహులు అనిపించుకున్న ఆ హీరోలను కాదని ప్రేక్షకుల దృష్టి తన వైపు తిప్పుకోవడం అంత ఆషామాషీ విషయమేం కాదనే సంగతి సుదీప్ కి తెలుసు. అయినా ఆయన తనదైన స్టైల్ తో తెరపైకి వెళ్లాడు. సుదీప్ యాక్టింగ్ లోనే సహజమైన స్టైల్ ఉంటుంది. ఆయన బాడీ లాంగ్వేజ్ .. డైలాగ్ డెలివరీ .. డైలాగ్ చెప్పే తీరు డిఫరెంట్ గా ఉంటాయి. అందుకే క‌న్న‌డ స్టార్ కూడా అయ్యాడు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement