Thursday, April 25, 2024

వారి నుంచి మ‌నం చాలా నేర్చుకోవాలి – మ‌హేశ్ బాబు మాట‌ల్లో త‌ప్పేముంది – కంగ‌నా

వివాదాల‌కి పెట్టింది పేరు బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగ‌నార‌నౌత్..అందుకే ఆమెని కాంట్ర‌వ‌ర్శి క్వీన్ అంటారు. ఎటువంటి విష‌యానైనా కుండ బ‌ద్ద‌లు కొట్టిన‌ట్టు మాట్లాడ‌టం ఆమె నైజం. కాగా గ‌త నాలుగైదు రోజులుగా బాలీవుడ్‌పై టాలీవుడ్ సూపర్ స్టార్ మ‌హేశ్ బాబు చేసిన కామెంట్ వైర‌ల్‌గా మారిన విష‌యం తెలిసిందే. హిందీ సినిమా త‌న‌ను భ‌రించ‌లేదంటూ మ‌హేశ్ చేసిన వ్యాఖ్య‌పై బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగ‌నర‌నౌత్ త‌న అభిప్రాయం వ్య‌క్తం చేసింది. ధాక‌డ్ ప్ర‌మోష‌న్స్‌లో భాగంగా మీడియాతో ఇంట‌రాక్ట్ అయిన‌ప్పుడు మ‌హేశ్ బాబు వ్యాఖ్య‌ల‌పై స్పందించాల్సిందిగా ఎదురైన ప్ర‌శ్న‌కు..ఆయ‌న స‌రిగ్గానే చెప్పార‌ని తెలిపింది కంగ‌న‌.. అనేక‌మంది డైరెక్ట‌ర్స్ నుంచి ఆయ‌నకు చాలా ఆఫ‌ర్లు రావ‌డం నాకు తెలుసు. భార‌తీ సినీ ప‌రిశ్ర‌మ‌లో ఆయ‌న జ‌న‌రేష‌న్ యాక్ట‌ర్లు తెలుగు సినిమాను అగ్ర‌భాగాన నిలిపారు. ఫ‌లితంగా ఆయ‌న‌ను బాలీవుడ్ భ‌రించ‌లేదు. అయితే ఆయ‌న ఏ సంద‌ర్భంలో ఆ కామెంట్ చేశారో నాకు తెలీద‌ని చెప్పింది..గ‌త ప‌ది, ప‌దిహేనేళ్లుగా తెలుగు సినిమా వెలిగిపోతోంద‌న‌డంలో ఎలాంటి వివాదం లేదు. వారి నుంచి మ‌నం చాలా నేర్చుకోవాల‌ని చెప్పింది. రెండు ఇండ‌స్ట్రీల మ‌ధ్య భాషా భేదంపై మాట్లాడ‌టానికి ఆమె అంగీక‌రించ‌లేదు. దేశంలో అనేక భాష‌లున్నాయి. ఏ భాషా ఇంకో భాష కంటే ఎక్కువా కాదు, త‌క్కువా కాద‌ని కంగ‌నా త‌న అభిప్రాయం చెప్పింది. మ‌రి కంగ‌నా వ్యాఖ్య‌ల‌కి ఎవ‌రు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement