Thursday, April 25, 2024

‘విక్ర‌మ్’ బిగ్ అప్ డేట్: ట్రైల‌ర్ ఎప్పుడంటే?

లోక‌నాయ‌కుడు క‌మ‌ల్‌హాస‌న్ న‌టించిన లేటెస్ట్ చిత్రం ‘విక్ర‌మ్‌’. లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు. భారీ యాక్ష‌న్ ఎంట‌ర్టైన‌ర్‌గా తెర‌కెక్కింది. ఇటీవ‌లే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం జూన్ 3న విడుద‌ల కానుంది. తాజాగా చిత్ర బృందం మ‌రో అప్‌డేట్‌ను ప్ర‌క‌టించారు. ‘విక్ర‌మ్’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ మే15న చెన్నైలో జ‌ర‌గ‌నున్న‌ట్లు తెలిపారు. అంతేకాకుండా అదే రోజున ట్రైల‌ర్‌ను కూడా విడుద‌ల చేయ‌నున్న‌ట్లు ప్రకటించారు.

కాగా, ఇప్పటికే విడుద‌లైన టైటిల్ టీజ‌ర్, మేకింగ్ గ్లింప్స్ అభిమానులను విప‌రీతంగా ఆక‌ట్టుకున్నాయి. సినిమాపై హైప్ పెంచాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement