Thursday, April 25, 2024

స్టాలిన్ తో కమల్ భేటీ.. నో పాలిటిక్స్!

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే పార్టీ భారీ విజయాన్ని అందుకుంది. తమిళనాడు ముఖ్యమంత్రిగా ఎం.కే స్టాలిన్ ఈ నెల 7న ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో మక్కల్ నీది మయ్యమ్ అధ్యక్షుడు, సినీ నటుడు కమల్ హాసన్ స్టాలిన్ ను కలిశారు. కాబోయే ముఖ్యమంత్రి స్టాలిన్ ను అభినందించారు. తొలిసారి అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగి విజయం సాధించిన స్టాలిన్ తనయుడు, హీరో ఉదయనిధిని కూడా కమల్ హాసన్ కలిసి శుభాకాంక్షలు తెలిపారు.

కాగా, మూడేళ్ళ క్రితం కమల్ హాసన్ సొంత పార్టీ మక్కల్ నీది మయంను పెట్టాడు. తొలిసారి అసెంబ్లీ ఎన్నికల్లో భారీ ఆశలతో తన అభ్యర్థులను నిలబెట్టాడు, వాళ్ళెవరూ గెలవలేదు సరికదా, కమల్ సైతం ఓటమి పాలయ్యాడు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో కోయంబత్తూర్ సౌత్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన కమల్.. బీజేపీ అభ్యర్థి వనతి శ్రీనివాసన్పై 1500 ఓట్ల తేడాతో ఓడిపోయారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement