Thursday, April 25, 2024

Hyderabad | కాటేదాన్‌లో క‌ల్తీ దందా.. కెమిక‌ల్స్‌తో అల్లం వెల్లుల్లి పేస్టు త‌యారీ!

కల్తీరాయుళ్లు రెచ్చిపోతున్నారు. నిత్యావసర స‌రుకుల‌ను కల్తీ చేసి సొమ్ము చేసుకుంటున్నారు. హైదరాబాద్‌లో నగర శివారు కాటేదాన్ పారిశ్రామికవాడలో కుళ్లిపోయిన అల్లం, పాడైన‌ వెల్లుల్లికి రసాయనాలు కలిపి అల్లంవెల్లుల్లి పేస్ట్ తయారుచేస్తున్నారు. ఈ కల్తీ దందాపై సమాచారం అందడంతో సైబరాబాద్ SOT పోలీసులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. పోలీసుల త‌నిఖీల్లో విస్తుపోయే విషయాలు బ‌య‌ట‌ప‌డ్డాయి.

కల్తీ అల్లం వెల్లుల్లి పేస్టుతో పాటు.. క‌ల్తీ మ్యాంగో కూల్‌డ్రింక్ కూడా తయారుచేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. అల్లంవెల్లుల్లి పేస్ట్ బాగా ఘాటుగా ఉండేందుకు అసిటిక్ యాసిడ్ వంటి ప్రమాదకరమైన రసాయనాలను క‌లుపుతున్న‌ట్టు ప‌రిశీల‌న‌లో వెల్ల‌డ‌య్యింది. అంతేకాకుండా తయారీలో మురుగు నీటిని వాడుతున్నట్లు తేలింది. ఈ దందా చేస్తున్న ఇద్దరు నిర్వాహకులను అరెస్ట్ చేసిన పోలీసులు.. వారి నుంచి 500 కిలోల‌ అల్లంవెల్లుల్లి పేస్టు, లిటిల్ చాంప్స్ కూల్‌డ్రింక్స్, 210లీటర్ల అసిటిక్ యాసిడ్, 550 కిలో నాన్ వెజ్ మసాలా ప్యాకెట్ల‌ను స్వాధీనం చేసుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement